Andhra Pradesh

News May 22, 2024

అనంత: వాలంటీర్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

గోరంట్ల మండల పరిధిలో కొత్తబోయినపల్లి వద్ద ఆదివారం వాలంటీర్‌ను హత్యచేసిన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుకొండ డీఎస్పీ బాబీ జాన్‌ సైదా వివరాల ప్రకారం.. గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన వాలంటీర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను కొత్తచెరువుకు చెందిన ఆరుగురు యువకులు మద్యం మత్తులో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచినట్లు పేర్కొన్నారు.

News May 22, 2024

కాకినాడ: LOVE మ్యారేజ్.. వివాహిత సూసైడ్

image

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన భీమేంద్ర గొల్లవిల్లికి చెందిన లలిత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతుండగా సోమవారం ఆమె ఉరేసుకొని చనిపోయింది. అల్లుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తన కూతురిని చంపేశాడని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు SI మనోహర్ జోషి తెలిపారు.

News May 22, 2024

కర్నూలు: కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

కర్నూలులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు వేసిన చోట కాకుండా వేరే బూత్‌లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కామేశ్ నాయక్‌ను ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కామేశ్ నాయక్ కృష్ణానగర్‌లో ఉన్న ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు డ్యూటీ వేశారు. ఆయన సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించారని వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేశారు.

News May 22, 2024

చిత్తూరు: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

image

అతని టార్గెట్ ఇళ్లు, ఉద్యోగుల గెస్ట్ హౌస్, స్టూడెంట్ హాస్టళ్లే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ ల్యాప్‌టాప్ దొంగలించడమే అతగాడి పని. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. అతను చిత్తూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి 25 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు.

News May 22, 2024

NLR: 100 మంది ఉద్యోగులకు నోటీసులు

image

ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ సీరియస్ అయ్యారు. పోలింగ్ రోజు విధులకు గైర్హాజరైన 100 మందికి పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు.

News May 22, 2024

నెల్లూరు జిల్లాలో 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పదోతరగతి, ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ ఫీడ్ వారు పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్ బ్లాక్ పరిసరాలను వారు పరిశీలించారు. పాణ్యం ఆర్ఓ నారపు రెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ తేజ్ పాల్గొన్నారు.

News May 22, 2024

A.N.U ఇంజినీరింగ్ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీటెక్, ఎంటెక్ కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 22, 2024

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు: వీరయ్య

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.వీరయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

News May 22, 2024

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు: కలెక్టర్

image

వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ యం.అభిషిక్త్ కిషోర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో రాయచోటి, సుండుపల్లె తంబళ్లపల్లె, పెద్దమండెం, బీ.కొత్తకోట, రామసముద్రం, పీలేరు నియోజకవర్గాలలో 13 మండలాలలో తాగునీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.