Andhra Pradesh

News May 22, 2024

విజయనగరం: ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వుడు, సివిల్ పోలీసుల మూడంచెల భద్రతను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు వెళ్లే మార్గాల వాహనా తనిఖీలు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆయా మార్గాల వెళ్లే వాహనాల వ్యక్తుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. ఈవిఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో ఉంటుందన్నారు

News May 22, 2024

శ్రీకాకుళం: గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి

image

ఎన్నికలు పోలింగ్ అనంతరం గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్సై ల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలకు గుర్తు చేశారు. కార్యకర్తలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News May 22, 2024

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: డీఆర్ఓ

image

ఈనెల 24వ తేదీన జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సత్యసాయి జిల్లా డీఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 28 మంది ఛీప్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందన్నారు.

News May 22, 2024

నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్: డీజీపీ

image

నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News May 22, 2024

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

image

కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సీల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖల కార్యక్రమాలు ప్రతివారం సమీక్షిస్తామని అన్నారు.

News May 22, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా మే
27 నుంచి జూన్ 23 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-రాయగడ(17243), తిరుపతి-విశాఖపట్నం(22708)
డబుల్ డెక్కర్లను మే 27 నుంచి జూన్ 22 వరకు రద్దు చేశారు. రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467) మెమో ప్యాసింజర్లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు.

News May 22, 2024

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్

image

ఏపీ గవర్నర్ ఏస్ అబ్దుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్, విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందర వల్లి, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పుష్పగుచ్ఛం అందజేశారు.

News May 21, 2024

REWIND: రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్రలో సాగింది

image

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.

News May 21, 2024

వైసీపీకి కాలం చెల్లింది: RRR

image

రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు(RRR) అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధారలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి తానేనని చెప్పారు. ఆ ఒక్క కారణంతోనే తనను జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

News May 21, 2024

భారత వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ

image

ఈ నెల 22వ తేదీ బుధవారం నుంచి అగ్ని -వీర్-వాయు ‘సంగీతకారుల’ కోసం భారత వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. ఆసక్తిగల అవివాహితులైన స్త్రీ, పురుషులు తమ పేర్లను ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ ఈ మేరకు సూచించారు.