Andhra Pradesh

News May 21, 2024

వైసీపీకి కాలం చెల్లింది: RRR

image

రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు(RRR) అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధారలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి తానేనని చెప్పారు. ఆ ఒక్క కారణంతోనే తనను జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

News May 21, 2024

భారత వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ

image

ఈ నెల 22వ తేదీ బుధవారం నుంచి అగ్ని -వీర్-వాయు ‘సంగీతకారుల’ కోసం భారత వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. ఆసక్తిగల అవివాహితులైన స్త్రీ, పురుషులు తమ పేర్లను ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ ఈ మేరకు సూచించారు.

News May 21, 2024

బిర్యానీలో చనిపోయిన ఎలుక.. టెస్ట్‌కు శాంపిల్స్!

image

భీమవరం పట్టణంలోని ఓ హోటల్‌లో ఈనెల 13న బిర్యానీలో చనిపోయిన ఎలుక వచ్చినట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న (సోమవారం) తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారి రామిరెడ్డి ఆహార పదార్థాలు పరిశీలించారు. శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News May 21, 2024

సామర్లకోట రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం

image

కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహిళ రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ట్రైన్ వస్తుండగా పట్టాలపై ఓ మహిళ పరిగెత్తడంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ లోవరాజు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

అనంత: మట్కా బీటర్ జిల్లా బహిష్కరణ

image

అనంతపురం జిల్లాలో మట్కా బీటర్‌పై జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గార్లదిన్నె మండల కేంద్రానికి చెందిన దూదేకుల అబ్దుల్ మట్కా నిర్వహిస్తున్నారు. గార్లదిన్నె ఎస్ఐ మహమ్మద్ గౌస్ అదుపులోకి తీసుకుని జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News May 21, 2024

నంద్యాల: బంధువుల ఇంటికి పంపలేదని ఆత్మహత్య

image

చాగలమర్రిలోని చింతచెరువు రస్తాకు చెందిన బొర్ర వెంకటసుబ్బమ్మ(52) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంటికి పంపలేదన్న కారణంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు స్థానిక కేరళ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 21, 2024

కడప: ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు 46 మందిపై కేసు

image

ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదైంది. కడప గౌస్ నగర్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్లు
పేర్కొన్నారు.

News May 21, 2024

విశాఖ: ఈవీఎంల స్ట్రాంగ్ రూముల తనిఖీ

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్‌తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదికి వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు.

News May 21, 2024

పుంగనూరులో ఓట్లు లెక్కింపు ఇలా..!

image

పుంగనూరులో 2,38,868 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,06, 916 ఓట్లు పోలయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన వీటిని లెక్కిస్తారు. ముందుగా పుంగనూరు మండలం ఎర్రగుంట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత చౌడేపల్లె, సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల ఈవీఎంలు తెరుస్తారు. చివరగా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి ఓట్లతో పుంగనూరు నియోజకవర్గ కౌంటింగ్ ముగుస్తుంది.

News May 21, 2024

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన సత్యసాయి జిల్లా అధికారులు

image

హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ కళాశాలలో స్ట్రాంగ్ రూములను సత్యసాయి జిల్లా అధికారులు పరిశీలించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్‌తో పాటు పలువురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం కళాశాలలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు.