Andhra Pradesh

News May 21, 2024

కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ

image

ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం మలినేని పట్నం సమీపంలో కడప-చైన్నై ప్రధాన రహదారిపై మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బద్వేల్ నుంచి కడపకు వెళ్తున్న బస్సును.. తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతింది. సంఘటనా స్థలానికి ఎస్సై పెద్ద ఓబన్న చేరుకోని విచారిస్తున్నారు.

News May 21, 2024

మాజీ MLA మృతి.. రేపు మార్కెట్‌కు సెలవు

image

కొవ్వూరు మాజీ MLA పెండ్యాల కృష్ణబాబు మృతికి సంతాపంగా బుధవారం కొవ్వూరు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని వ్యాపారవర్గాలు గమనించి సహకరించాలని సూచించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణబాబు మార్కెట్ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. కాగా.. రేపు దొమ్మేరులో కృష్ణబాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

News May 21, 2024

అసత్య ప్రచారాలు తగదు: కాకినాడ ఎస్పీ

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక ఘటనలకు అవకాశం అంటూ వస్తున్న అసత్య ప్రచారాలు తగవని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. లెక్కింపు రోజు, ఫలితాల తర్వాత కాకినాడ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న సందేశాల్లో ఏమాత్రం నిజం లేదని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News May 21, 2024

REWIND: రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్రలో సాగింది

image

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.

News May 21, 2024

అనంత: గుండెపోటుతో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మృతి

image

గుత్తి RWS డీఈఈ రాజ్ కుమార్ మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన అనంతపురంలో నివసిస్తూ గుత్తిలో పనిచేస్తున్నారు. గత సోమవారం గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు నగరంలోని సవేరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.

News May 21, 2024

అల్లర్లు జరగకుండా చర్యలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో తహశీల్దార్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. జిల్లాలో రాజకీయ ఘర్షణలు జరగకుండా కిందిస్థాయి సిబ్బందితో సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News May 21, 2024

గుంటూరు: ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ఆహ్వానం

image

గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మంగళవారం తెలిపారు. OC-01, EWS -01, BC–B(W)-01 పోస్టులకు, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు 18 నుంచి 42 సం.ల లోపు వయస్సు కలిగి ఉండి, 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్హతలు కలిగి ఉండాలని సూచించారు.

News May 21, 2024

కృష్ణా జిల్లాలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

image

కంకిపాడు మండలం దావులూరులో దారుణం చోటు చేసుకుంది. అంగవైకల్యంతో ఉన్న ‘దివ్యాంగురాలి’ పై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని బాలిక తల్లి కంకిపాడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు ‘రెండు వారాల’ నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గర్భవతని తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు.

News May 21, 2024

VZM: జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు

image

ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌తో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాల బారిన పడొద్దని కోరారు. ఈ తరహా సైబర్ మోసగాళ్ల కాల్స్ భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ ప్రజలెవరూ స్పందించకూడదన్నారు.

News May 21, 2024

ప.గో: భార్యను స్వదేశానికి రప్పించాలని వినతి

image

ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన తన భార్య అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఉర్ల నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలోని హెల్ప్‌డెస్క్ కార్యాలయంలో గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. యజమానులు భోజనం సైతం పెట్టడం లేదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.