Andhra Pradesh

News May 21, 2024

కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు: కలెక్టర్

image

రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.

News May 21, 2024

22, 23న విద్యార్థులకు కౌన్సిలింగ్

image

22, 23వ తేదీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. 22న చిన్నటేకూరులో బాలురకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 23న దిన్నేదేవరపాడులో ఉన్న గురుకుల పాఠశాలలో ఆర్డర్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

News May 21, 2024

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: డీఆర్ఓ

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో మంగళవారం విద్యాశాఖ అధికారులతో డీఆర్ఓ కొండయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 10,461 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News May 21, 2024

స్ట్రాంగ్ రూములను జాగ్రత్తగా చూసుకోండి: SP

image

వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు ఉంచిన గదుల్లోకి వర్షపు నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఆరిపుల్లా, ఏఆర్‌ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ నీలకంఠేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

News May 21, 2024

తెర్లాం: గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తుల అరెస్టు

image

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్ తిరుమల రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం ఎస్ఐ రమేశ్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తెర్లాం జంక్షన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసునున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.5 కేజీ గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించామని సీఐ వివరాలను వెల్లడించారు

News May 21, 2024

అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి దరఖాస్తుల ఆహ్వానం

image

అఖిల భారత అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ కాన్పూర్, బెంగళూరులో జరుగుతుందన్నారు. అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి అర్హులైన వారంతా 22వ తేదీ నుంచి జూన్ 5 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

News May 21, 2024

విశాఖ: యువకుడి స్పాట్‌డెడ్

image

ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జంక్షన్ వద్ద ఓ ప్రైవేటు బస్సు టర్నింగ్ తిప్పుతుండగా.. తుని నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వినయ్ అనే యువకుడు చనిపోగా.. దుర్గేశ్ గాయపడ్డాడు. మృతుడి స్వగ్రామం, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

కడప: పిడుగుపాటు.. ఒకరికి గాయాలు

image

సిద్ధవటం మండలంలోని మిట్టపల్లిలో పిడుగుపాటుకు గులక రాళ్లు తగిలి కాడే వెంకటస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో మిట్టపల్లి దేవాలయం ఎదురుగా ఉన్న పాత నీటి ట్యాంకు బేస్ మీద పిడుగు పడింది. దీంతో 20 మీటర్ల దూరంలో ఉన్న వెంకటస్వామికి గులక రాళ్లు తగిలి గాయాలయ్యాయి.

News May 21, 2024

తెలంగాణ ఈ సెట్‌లో పరవాడ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

image

పరవాడలో నివాసముంటున్న ఖ్యాతేశ్వర్ తెలంగాణ ఈ సెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 2023లో కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో 80% మార్కులతో ఉత్తీర్ణత చెందాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాలెం గ్రామానికి చెందిన ఖ్యాతేశ్వర్ తండ్రి విన్నారావు ఉద్యోగం నిమిత్తం పరవాడలో ఉంటున్నారు.

News May 21, 2024

రైతన్నలకు తోడుగా మేము సైతం సిద్ధమంటోన్న కోతులు

image

అనంతపురం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు పొలంలో సేద్యం చేసే పనిలో నిమగ్నమై దర్శనమిస్తున్నారు. అయితే పుట్లూరు మండలంలో మంగళవారం వానరాలు సైతం మేము కూడా పొలం దున్నేందుకు సిద్ధమంటూ ఏకంగా ట్రాక్టర్‌లో కూర్చుని రథసారథిగా మారి తన మిత్ర వానరాలను సైతం వెంటపెట్టుకుని వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.