Andhra Pradesh

News May 21, 2024

కృష్ణా: ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు, విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 21, 2024

తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య

image

తిరుమలలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొండపై ఉన్న B-టైప్ క్వార్టర్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

image

ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జరగబోయే పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని వెల్లడించారు.

News May 21, 2024

శ్రీకాకుళం: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News May 21, 2024

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల కార్డెన్ సర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. రౌడీ షీటర్లను, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.

News May 21, 2024

ప.గో.: మాజీ MLA మృతి.. నేపథ్యమిదే

image

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఎమ్మెల్యేగా 5 సార్లు ఎన్నికయ్యారు. 1983లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఆయన 65,893 ఓట్లు సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన ఆయన 1985, 1989, 1994, 2004 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

News May 21, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

image

జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

News May 21, 2024

నెల్లూరు: భారీగా నిలిచిన వాహనాలు

image

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారు. వీటిని గ్రామస్థులు అడ్డుకున్నారు. నూతన రహదారి నిర్మాణ క్రమంలో పెద్దపడుగుపాడు గ్రామానికి ఊన్న దారిని మూసేస్తున్నారని చెప్పారు. తమ రోడ్డు అలాగే ఉంచాలంటూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు ఆందోళనకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.

News May 21, 2024

కాకినాడ: వివాహిత ఆత్మహత్య.. అక్రమ సంబంధమే కారణమా..?

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన బోరా దుర్గ (38) మంగళవారం గ్రామ శివారులోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గకు కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్నారు. ప్రియుడితో గొడవలు పడిందని, అతడు ఆమె తలపై కొట్టాడని తెలుస్తుంది. దుర్గకు భర్త, పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

అనకాపల్లి: 10 ద్విచక్ర వాహనాలు.. మూడు ఆటోలు సీజ్

image

అనకాపల్లి పట్టణ శివారు ప్రాంతాలైన సుబ్రమణ్యం కాలనీ, డీబీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.