Andhra Pradesh

News May 21, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

image

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

News May 21, 2024

చీరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వాడరేవు – రామాపురం రోడ్డులో మంగళవారం ఉదయం బైక్ అదుపుతప్పి ఊటుకూరి సుబ్బయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు బాలాజీ (55) దుర్మరణం చెందాడు. ఉదయం బైక్‌పై వేగంగా వెళుతుండగా అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 21, 2024

ప.గో.: ఎలక్షన్ డ్యూటీ.. ఆ అధికారులకు రూ.20 వేతనం..!

image

ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం తదితర అక్రమ రవణాను అడ్డుకునేందుకు స్టాటిక్, ఫ్లయింగ్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటుచేశారు. అయితే ఉంగుటూరు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రెండేసి చొప్పున బృందాలను నియమించారు. 2నెలలపాటు 12గంటల చొప్పున పనిచేశారు. వేతనం కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా రోజుకు రూ.20 చొప్పున రూ.1200 చొప్పున చెల్లిస్తామన్నారు. ECఆదేశాల్లో ఇంతే ఉందని తహశీల్దార్ వెంకటశివయ్య స్పష్టం చేశారు.

News May 21, 2024

తెలంగాణ ఈ సెట్‌లో పరవాడ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

image

పరవాడలో నివాసముంటున్న ఖ్యాతేశ్వర్ తెలంగాణ ఈ సెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 2023లో కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాలెం గ్రామానికి చెందిన ఖ్యాతేశ్వర్ తండ్రి విన్నారావు ఉద్యోగం నిమిత్తం పరవాడలో ఉంటున్నారు.

News May 21, 2024

కిర్గిస్థాన్‌లో భయం నీడన రాజాం విద్యార్థులు

image

కిర్గిస్థాన్‌ దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాంకు చెందిన 13 మంది విద్యార్థులు భయం నీడన ఉన్నారు. ఈ తెల్లవారుజామున మరోసారి తాము నివాసం ఉంటున్న హాస్టల్‌పై దుండగులు ఎటాక్ చేసినట్లు చెప్పారు. వీలున్నంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు రాజకీయ నేతలు, అధికారులు కృషి చేయాలని వీరు ప్రాధేయపడుతున్నారు.

News May 21, 2024

మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురే జయ

image

అమెరికాలో విజయవాడ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. 2004-09 వరకు మచిలీపట్నం ఎంపీగా చేసిన బాడిగ రామకృష్ణ కుమార్తె అయిన జయ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె ఇదే కోర్టులో కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అమెరికాలో జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళగా జయ రికార్డు సృష్టించారు.

News May 21, 2024

నంద్యాల: ఓ వైపు విష్ణు స్వరూపం.. మరోవైపు శివుడిగా దర్శనం

image

ఆత్మకూరు మండలం నల్వకాల్వ గ్రామసమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో స్వామిఅమ్మవారు పాణిపట్టంపై కొలువుదీరి ముందు భాగంలో విష్ణుస్వరూపంగా వెనుక భాగంలో శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాయాణంలో పుష్యమాసం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం సూర్యకిరణాలు స్వామిఅమ్మవార్లపై ప్రసరించడంతో గర్భాలయ గోడలపై నీడ లింగకారంలో ప్రతిబింబిస్తుంది.

News May 21, 2024

పెందుర్తి: 24న ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.

News May 21, 2024

తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాక

image

తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో పాటు రానున్న ఆయన రాత్రి కొండపై బస చేయనున్నారు. బుధవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News May 21, 2024

కారంచేడు: రైలు నుంచి కింద పడి మృతి

image

కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కప్పరపు మణికంఠ అనే యువకుడు రైలునుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలేశ్వరుని దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో వస్తూ గేటు పక్కన కూర్చొని గూడూరు సమీపంలో నిద్ర మత్తులో జారిపడి మణికంఠ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసులు దర్యాప్తు జరిపి మంగళవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.