Andhra Pradesh

News September 9, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: కృష్ణా ఎస్పీ
☞ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 105 R&B రోడ్లు ధ్వంసం
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం
☞  మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు కృషి చేయాలి: బాలశౌరి
☞ మోపిదేవి ఆలయంలో భక్తుల రద్దీ

News September 9, 2025

ప్రొద్దుటూరు: బార్‌లుగా మారిన బ్రాంది షాపులు

image

మద్యం దుకాణల్లో బల్లలు వేసి, మద్యం తాగించడానికి పర్మిట్ రూములకు అనుమతులు పొందారు. ప్రొద్దుటూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 18, రూరల్ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఏడాదికి రూ.7.50 లక్షలు, రూరల్‌లో రూ.5 లక్షలు చొప్పున 3 నెలలకు డబ్బులు చెల్లించారు.

News September 9, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న అమ్మాయి సంఖ్య

image

చిత్తూరు జిల్లాలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి మంది మగవారికి నగరిలో అత్యల్పంగా 873 అమ్మాయిలు ఉండగా, పలమనేరులో 894, కుప్పంలో 904, చిత్తూరులో 912 మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యత్యాసాలకు బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు ప్రధాన కారణమని భావించి వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News September 9, 2025

ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News September 9, 2025

ప్రకాశం: బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

image

మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది. ఆమె మృతిపై విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు.

News September 9, 2025

ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్‌ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామన్నారు.

News September 9, 2025

జ్ఞానపురంలో అర్ధరాత్రి హల్చల్.. ఇంటి యజమానిపై దాడి

image

జ్ఞానపురంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఇంటి తలుపులు, కిటికీలు కొట్టడంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ పీలా శ్రీనివాసరావు (55), తన కుమారుడు పూర్ణ సాయితో వెళ్లి ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం CI రవి కుమార్ మంగళవారం తెలిపారు. నిందుతులు పాత నేరస్తులైన దేవర కళ్యాణ్, దుర్గా ప్రసాద్‌గా గురించారు.

News September 9, 2025

ఆకివీడు: మహిళ‌పై దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదు

image

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడికి దిగి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన సువ్వారి రంగమ్మ మరో ముగ్గురితో కలిసి ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న సింగపర్తి కొండ దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ జే నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

News September 9, 2025

వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

image

ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

News September 9, 2025

VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

image

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.