Andhra Pradesh

News May 21, 2024

VZM: 24న ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.

News May 21, 2024

జాతీయ క్రికెట్ టోర్నీలో.. అంపైర్ మన ఏలూరు వాసి

image

జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీ అంపైర్‌గా ఏలూరుకు చెందిన ఆర్.నాగేంద్రసింగ్ ఎంపికైనట్లు మహారాష్ట్ర దివ్యాంగ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు భగవాన్ తల్వారే సోమవారం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పుణెలో నిర్వహించే జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో అంపైర్‌గా వ్యవహరిస్తారన్నారు.

News May 21, 2024

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక MP స్థానం ఉంది. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటేశారని.. జగన్ మళ్లీ సీఎం అవుతారని ధర్మాన సోదరులు, తదితరులు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని అచ్చెన్నాయుడు తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 21, 2024

అక్రమ ఇసుక త్రవ్వకాలు జరిగితే ఫిర్యాదు చేయండి: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక త్రవ్వకాలు జరిగితే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిగితే వెంటనే dmgoatpsandcomplaints@yahoo.com అనే మెయిల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిగితే ఫిర్యాదులు చేయవచ్చని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News May 21, 2024

విశాఖ: సామాన్యులకు అందని మామిడి పండ్లు

image

మామిడి పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నగరంలో కిలో మామిడి పండ్లను రూ.150- రూ.200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వాటి దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు.

News May 21, 2024

కొండాపురం: బంగారు పథకానికి ఎంపికైన శ్రావణి

image

మండలంలోని రేణమాల గ్రామానికి చెందిన కండే శ్రావణి కామర్స్ లో స్వర్ణ పథకానికి ఎంపికయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ పూర్తయ్యాక ఈమె కొన్నేళ్లపాటు చదువును నిలిపివేశారు. అనంతరం చదువుపై మక్కువతో వింజమూరులోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు, ప్రథమ స్థానంలో నిలిచారు. వివాహమయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చదువుకున్నారు. నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోనున్నారు.

News May 21, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం కృష్ణా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 16 అసెంబ్లీ, 2 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటేశారని మంత్రి జోగి రమేశ్, కొడాలి నాని తదితరులు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని దేవినేని ఉమా, బుద్దా వెంకన్న తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 21, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటు వేశారని మంత్రి అంబటి, తదితర నేతలు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని యరపతినేని, ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీది ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 21, 2024

ప్రకాశం: నేటి నుంచి డిగ్రీ మూల్యాంకనం ప్రారంభం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 4, 5వ సెమిస్టర్ల పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. కళ్యాణి తెలిపారు. ఉదయం 10 గంటలకు మూల్యాంకనం ప్రారంభమవుతుందని, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఐడీ కార్డ్, కాలేజీ రిలీవింగ్ ఆర్డర్ తీసుకురావాలని కోరారు.

News May 21, 2024

ఉమ్మడి అనంత జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు శుభవార్త

image

అనంతపురం జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు ఈనెల 23న ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. హోండా మోటార్, స్కూటర్ ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలకు హాజరవుతాయన్నారు. ఐటిఐ చదువుతున్న, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.