Andhra Pradesh

News May 21, 2024

కడప: విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు

image

జిల్లాలోని బద్వేల్ పరిధిలోని కొంగలవీడుకు చెందిన జి. జ్యోతి (18) కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోందని, ఈనెల 19న బయటికి వెళ్లి తిరిగిరాలేదని ఆమె తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోపయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలియజేశారు.

News May 21, 2024

కర్నూలు: ఆ ఇద్దరి మహిళది హత్యే

image

కర్నూలు గార్గేయపురం నగరవరం చెరువులో మహిళల మృతదేహాలు బయటపడిన సంగంతి తెలిసిందే. ఇద్దరు మహిళలో ఒకరు మహబూబ్‌‌నగర్ జిల్లాకు చెందిన జానకిగా, మరొకరు అరుణగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్‌తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్యచేసినట్లు విచారణలో తెలింది.

News May 21, 2024

కాకినాడ: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి మృతి

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్‌ కళాశాలలో కోనేటి రాజా నరేంద్ర(21) బీటెక్‌ సీఎస్‌ఈ విభాగంలో థర్డ్‌ఈయర్ చదువుతున్నాడు. కాగా మొదటి రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఈ నెల 4న కళాశాల వెనుక ఉన్న జీడిమామిడి తోటలో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

News May 21, 2024

RRR విజయం సాధించేనా..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 13 చోట్ల గెలిచింది. 2 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. అయితే వైసీపీ MPగా గెలిచి.. ఆ పార్టీకి రాజీనామా చేసిన RRR టీడీపీలో చేరి ఉండి MLA అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మరి RRR విజయం సాధించేనా..?
– ఉమ్మడి ప.గో.లో కూటమికి ఎన్ని సీట్లు రావొచ్చు..?

News May 21, 2024

TPT: మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి డిగ్రీ (UG) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 21, 2024

బిట్రగుంట : 27 నుంచి మెమూ రైళ్లు రద్దు

image

బిట్రగుంట -విజయవాడ- చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య మరోమారు మెమూ రైళ్లు రద్దు కానున్నాయి. బిట్రగుంట – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు, బిట్రగుంట- చెన్నై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగించే మెమూను ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు, తిరిగి 10 నుంచి 14, 17 నుంచి 21 తేదీల మధ్యలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

News May 21, 2024

విశాఖ: డిసెంబర్ 15న నేవీ మారథాన్

image

భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో ఈ ఏడాది డిసెంబర్ 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు సోమవారం నేవీ అధికారులు తెలిపారు. ఆ రోజు 42.2 కి.మీ.తో మారథాన్, 21.1 కి.మీ.తో హాఫ్ మారథాన్, 10 కి.మీ.తో ఆరోగ్య పరుగు, 5 కి.మీ.తో రన్ ఫర్ ఫన్ ఉంటుందని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని, ఆసక్తి కలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

News May 21, 2024

పార్వతీపురం: 24 తేది నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి జూన్ 7వ తేది వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. కేశవనాయుడు అన్నారు. సోమవారం పార్వతీపురం ఇంటర్ పరీక్షల నిర్వహణపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, వర్షాలు పడినా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉండాలన్నారు.

News May 21, 2024

జగ్గయ్యపేట: వ్యభిచార గృహంపై దాడి

image

జగ్గయ్యపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని తొర్రకుంటపాలెంలో ఓ మహిళ గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జానకి రామ్, పట్టణ-1 ఎస్సై సూర్యభగవాన్‌, సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.

News May 21, 2024

గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

image

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.