Andhra Pradesh

News May 21, 2024

గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

image

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.

News May 21, 2024

అంజాద్ బాషా, వాసుపై కేసు నమోదు

image

కడప గౌస్‌నగర్‌లో జరిగిన అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ వర్గాలకు సంబంధించిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డిపై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

News May 21, 2024

ప్రకాశం: అన్నా పందెం ఎంత.?

image

ఒకవైపు ఐపీఎల్, మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిపై జిల్లాలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనంతగా ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం ఎవరు అవుతారు, వచ్చే మోజార్టీ ఎంత, ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు గెలుస్తారు..? ఇలా పలు అంశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. ధనమే కాకుండా ఇళ్లులు, భూములు సైతం పందేల్లో పెడుతున్నారు.

News May 21, 2024

కర్నూలు: చెట్టు విరిగి పడి బాలుడు మృతి

image

హాలహర్వి మండలంలోని విరుపాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శాంతమ్మ, బసవరాజు దంపతుల కుమారుడు సంతోష్ (9) గ్రామంలోని చెట్టు కింద ఆడుకుంటుండగా గాలివాన కురిసింది. దీంతో అక్కడున్న చెట్టు కిందకు వెళ్ళారు. ఆ సమయంలో చెట్టు విరిగి సంతోశ్‌పై పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన మరో బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 21, 2024

అనంతలో ఇంటర్ అడ్వాన్స్‌‌డ్ పరీక్షలకు 22,510మంది విద్యార్థులు దరఖాస్తు

image

అనంతపురం జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 22,510 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,921మంది, ఒకేషనల్ విద్యార్థులు 980మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,017మంది, ఒకేషనల్ విద్యార్థులు 592 మంది ఉన్నారు. 34 కేంద్రాలకు గాను అనంతపురం నగరంలోనే 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్‌ఓ వెంకటరమణ తెలిపారు.

News May 21, 2024

కడప: అన్నా పందెం ఎంత.?

image

ఒకవైపు ఐపీఎల్, మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిపై జిల్లాలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనంతగా ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం ఎవరు అవుతారు, వచ్చే మోజార్టీ ఎంత, ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు గెలుస్తారు..? ఇలా పలు అంశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. ధనమే కాకుండా ఇళ్లులు, భూములు సైతం పందేల్లో పెడుతున్నారు.

News May 21, 2024

సబ్సిడీ వేరుశనగ కోసం 10,205మంది రైతులు రిజిస్ట్రేషన్

image

అనంతపురం జిల్లాలోని 29 మండలాల్లో సబ్సిడీ వేరుశనగ కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో 10,205 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 9,077 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులకు సబ్సిడీపై వేరుశనగలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

News May 21, 2024

అమెరికాలో ప.గో. అమ్మాయికి ప్రశంస

image

ప.గో. జిల్లా పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్‌ అమెరికాలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో ఇద్దరు నోబుల్ అవార్డు గ్రహీతల సమక్షంలో వైద్యరంగంలోని పలు అంశాలపై ప్రసంగించింది. ఈ మేరకు నోబుల్ గ్రహీతలు డేవిడ్ జూలియస్, రాంఢీ స్కెక్మాన్‌ ఆమెను అభినందించారు.

News May 21, 2024

విచారణకు నేను సిద్ధం: లావు కృష్ణదేవరాయలు

image

పల్నాడులో అల్లర్లకు తానే కారణమని YCP నేతలు ఆరోపిస్తున్నారని నరసరావుపేట MP అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ముకేశ్ కుమార్‌కు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. తన కాల్ డేటా పరిశీలించాలని, విచారణకు సిద్ధమని ప్రకటించారు.

News May 21, 2024

కల్లూరు: ఊయల మెడకు చుట్టుకుని బాలిక మృతి

image

పులిచెర్ల మండలం కల్లూరులో ప్రమాదవశాత్తు ఊయల మెడకు చుట్టుకుని 9 ఏళ్ల చిన్నారి మోమిన్ మృతి చెందినట్లు ఎస్సై రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. సదుం మండలానికి చెందిన మోమిన్ తన అక్కతో కలిసి కల్లూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సోమవారం చీరతో చేసుకున్న ఊయలలో మోమిన్ ఊగుతూ మెడకు బిగుసుకోగా.. బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.