Andhra Pradesh

News May 21, 2024

నంద్యాల:యువకుడిపై గొడ్డలితో దాడి

image

మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

తెర్లం: గంజాయితో ఆరుగురు అరెస్ట్

image

గంజాయతో పట్టుబడిన ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై ఆర్.రమేశ్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలో రంగప్పవలస చెరువు దగ్గర ఒడిశా రాష్ట్రం నుంచి 2.193 కిలోల గంజాయి తీసుకువస్తుండగా యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసు బొబ్బిలి సీఐ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News May 21, 2024

జలుమూరు: ఒకే ఈతలో నాలుగు దూడలు

image

పాడి పశువులు సాధారణంగా ఒకటి లేదా రెండు దూడలకు జన్మనిస్తాయి. మూడు దూడలు జన్మించడం చాలా అరుదు. ఒకే ఈతలో నాలుగు దూడలు పుట్టిన ఘటన జలుమూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్ద దూగాం గ్రామానికి చెందిన రైతు గుండ సింహాచలానికి చెందిన ఆవు సోమవారం ఒకే ఈతలో నాలుగు దూడలకు జన్మనిచ్చింది. రెండు మగ, రెండు ఆడ దూడలు జన్మించగా, రెండు గంటల వ్యవధిలో ఒక మగ దూడ, ఒక ఆడ దూడ మృతి చెందాయి. మిగిలిన రెండు ఆరోగ్యంగానే ఉన్నాయి.

News May 21, 2024

ప్రకాశం: రోజురోజుకు పెరుగుతున్న ధరలు

image

రోజురోజుకూ పొగాకు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒంగోలు-1 కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో రూ.312, ఒంగోలు-2, కొండపి కేంద్రాల్లో రూ.310, పొదిలిలో రూ.309, వెల్లంపల్లిలో రూ.307, టంగుటూరులో రూ.306 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఈ ఏడాది పొగాకు అమ్మకాలు మొదలు పెట్టినప్పుడు రూ.290 నుంచి మొదలైంది.

News May 21, 2024

అనంతపురంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

image

అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలో గాలివానకు 40 చెట్లు విరిగిపడటంతో పాటు 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు 75 శాతం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News May 21, 2024

కృష్ణా: ఆ 6,289 ఓట్లు ఎవరికి పడ్డాయో.?

image

గుడివాడ అసెంబ్లీ స్థానంలో తాజా ఎన్నికల్లో 82.51% పోలింగ్ నమోదు కాగా 1,68,537 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో పురుషులు 81,119, స్త్రీలు 87,408, ఇతరులు 10 మంది ఓటేశారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు 6,289 ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్లు తమకే పడ్డాయని అటు వైసీపీ, టీడీపీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి వెనిగండ్ల రాము, కొడాలి నాని పోటీ చేస్తుండగా జూన్ 4న తీర్పు వెలువడనుంది.

News May 21, 2024

విశాఖ జిల్లాలో 38,933 మంది హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు

image

విశాఖ జిల్లాలో 38, 933 మంది హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా గుర్తించామని వీరిలో 18, 541 మంది ఏఆర్టి మందులు ఉపయోగిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 20 సంవత్సరాల్లో జిల్లాలో 11, 566 మంది మరణించారని జిల్లావ్యాప్తంగా 7 ఈఆర్టి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో 3 వ ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ స్మృత్యంజలి దినముగా జరుపుతుంటారు.

News May 21, 2024

కాకినాడ: వృద్ధురాలిపై అత్యాచారం

image

వృద్ధురాలిపై(60) అత్యాచారం జరిగిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. SI బాలాజీ వివరాల ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన ఓ వృద్ధురాలిపై స్థానికంగా ఓ రైతు దగ్గర పనిచేస్తున్న యువకుడు, అతని స్నేహితుడు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలు ఆమె కొడుకుతో విషయం చెప్పింది. విచారించగా సామర్లకోటకు చెందిన కోట శేఖర్, ఏవీ నగరానికి చెందిన కాలిబోయిన గంగాధర్‌గా తెలిసింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News May 21, 2024

రూ.2.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ: ఎస్పీ

image

చాట్ బోట్, సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు రూ.2.52 కోట్ల విలువ చేసే 1393 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. పలు విడతలుగా కేసులు చేధిస్తూ.. బాధితులను గుర్తించి వాటిని అందించామన్నారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లు గుర్తించమన్నారు.

News May 21, 2024

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: వికాస్ మర్మత్

image

కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియపై అధికారులతో కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో జేసీ సేతు మాధవన్, సబ్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.