Andhra Pradesh

News May 21, 2024

రూ.2.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ: ఎస్పీ

image

చాట్ బోట్, సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు రూ.2.52 కోట్ల విలువ చేసే 1393 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. పలు విడతలుగా కేసులు చేధిస్తూ.. బాధితులను గుర్తించి వాటిని అందించామన్నారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లు గుర్తించమన్నారు.

News May 21, 2024

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: వికాస్ మర్మత్

image

కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియపై అధికారులతో కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో జేసీ సేతు మాధవన్, సబ్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

News May 21, 2024

నంద్యాల: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

image

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.

News May 21, 2024

రాజమండ్రి సెంట్రల్ జైలుకు అవార్డు

image

జీవ వైవిధ్య, పర్యావరణ విలువలు పాటిస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు తరఫున ‘బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డు’కు ఎంపికైనట్లు జైలు పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News May 21, 2024

కడప: ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

image

జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రొద్దుటూరు నియోజకవర్గ కౌంటింగ్‌కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్త్ ఏర్పాట్లపై స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు.

News May 21, 2024

కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారులే కీలక పాత్ర పోషించాలి: కలెక్టర్

image

కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జూన్ 6 తేదీ వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నిర్వహించాలన్నారు. 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్‌లో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

News May 21, 2024

పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలి: అనంత కలెక్టర్

image

జిల్లాలోని పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాలల శాఖ, ఇంటాక్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు.

News May 21, 2024

ఎచ్చెర్ల: సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం సాయంత్రం ఎస్పీ జీ.ఆర్ రాధిక సందర్శించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ బయట భద్రతాపరమైన అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఆమె వెంట ఏఎస్పీ ప్రేమ్ కాజల్, డిఎస్పీ వై. శృతి, ఎస్సై చిరంజీవి ఉన్నారు.

News May 21, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం – విశాఖ రైలు ఏప్రిల్ 27 నుంచి మే 22 వరకు, విశాఖ – మచిలీపట్నం రైలును ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు, గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ 27 నుంచి వచ్చే నెల 22 వరకు.. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు రద్దు చేశారు.

News May 21, 2024

ప.గో: స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

భీమవరంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత కలిసి సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలను జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల పరిధిలో మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.