Andhra Pradesh

News May 20, 2024

నెల్లూరు: 21నే జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ జిల్లా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పాత షెడ్యూల్ ప్రకారం ఆయన 22న జిల్లాకు రానుండగా.. తాజా షెడ్యూల్ ప్రకాం 21వ తేదీ సాయంత్రం 5.10 నిమిషాలకు గుంటూరు నుంచి రైలులో బయలుదేరి రాత్రి 9.24 నిమిషాలకు నెల్లూరుకు చేరుకోనున్నారు. 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు.

News May 20, 2024

శ్రీకాకుళం: జిల్లా నోడల్ అధికారిగా ఉమామహేశ్వరరావు

image

బక్రీద్‌ను పురస్కరించుకుని రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ నియమావళిని అమలు చేసేందుకు జిల్లా నోడల్‌ అధికారిగా ఏఎస్పీ (క్రైమ్‌) వి.ఉమామహేశ్వరరావును నియమించినట్లు ఎస్పీ జి.ఆర్‌ రాధిక సోమవారం తెలిపారు. జిల్లాలో జంతువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జంతువులను అక్రమంగా తరలించినా 63099 90803 కు సమాచారం ఇవ్వాలన్నారు.

News May 20, 2024

శ్రీసత్యసాయి: పిడుగు పాటుతో వ్యక్తి మృతి

image

బత్తలపల్లి మండలంలో పిడుగు పాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పర పల్లి సమీపంలో పిడుగు పడడంతో జింక చలపతి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News May 20, 2024

పాచిపెంట : మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పి నారాయణరావు తెలిపిన ప్రకారం.. పాంచాలి గ్రామానికి చెందిన కలువలపల్లి రాంబాబు(45) మద్యానికి బానిపై అయ్యాడు. అతిగా మద్యం తాగవద్దని భార్య మందలించింది. మనస్తాపం చెందిన రాంబాబు ఈ నెల 18న గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

News May 20, 2024

భారీ వర్షాలతో చెన్నూరు వద్ద పెన్నా నదికి జలకళ

image

పెన్నా నది, కుందూ నది, ఎగువ ప్రాంతంలోని నంద్యాల జిల్లా, కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవడంతో కుందూ నది నుంచి పెన్నా నదిలోకి వర్షపు నీరు చేరుతున్నది. పెన్నా నది ఎగువ ప్రాంతంలో ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పెన్నా నదిలోకి వర్షం నీరు పరుగులు పెడుతున్నది. సోమవారం వల్లూరు మండలం ఆది నిమ్మయపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట వద్ద నీటి కల సంచరించుకుంది.

News May 20, 2024

ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్: కలెక్టర్

image

ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా ఓట్ల లెక్కింపు వేగవంతం అవుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో డెమో నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా లెక్కించాలనే అంశంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.

News May 20, 2024

24నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో సుభద్ర చెప్పారు. 24న తెలుగు, కాంపోజిట్ కోర్సు, 25న ద్వితీయ భాష హిందీ, 27న ఇంగ్లీషు, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయాలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, జూన్ 1న కాంపోజిట్ కోర్సు సేవం- ఓఎస్ఎన్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 3న ఓఎస్ఎన్ సీ మెయిన్ పరీక్ష జరుగుతుందన్నారు.

News May 20, 2024

తునిలో రైలు నుంచి పడి వ్యక్తి దుర్మరణం

image

తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తుని రైల్వే ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నీలం రంగు జీన్స్ ప్యాంట్, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపర్చినట్లు తెలిపారు. సంబంధీకులు ఉంటే తుని రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

News May 20, 2024

ఎన్టీఆర్‌కి కొడాలి నాని శుభాకాంక్షలు

image

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని X వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ.. ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్న పాత ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

News May 20, 2024

ఆమదాలవలస: నిబంధనలు ఉల్లంఘించిన లారీలు సీజ్

image

ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట ఇసుక ర్యాంప్ వద్ద సుమారు 10 లారీలను సోమవారం సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ఇసుక లారీలు ఉండడంతో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ర్యాంప్ మూసివేసినప్పటికీ యథేచ్ఛగా ఇసుక తరలించడంతో చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.