Andhra Pradesh

News May 20, 2024

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

జూన్ 4న కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో బాణా సంచా విక్రయాలు చేపట్టవద్దని హోల్ సేల్ డీలర్స్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

News May 20, 2024

శ్రీకాకుళం: 4,35,049 మంది ఓటు వేయలేదు

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టించారు. పోలైన ఓట్లు గణాంకాలే 18,75,934 మంది ఓటర్లకు 14,40,885 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.81 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తేల్చారు. 4,35,049 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 36,836 మంది అధికంగా ఓటేశారు. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోని వారు నాలుగు లక్షల మంచికి పైగా ఉన్నారు.

News May 20, 2024

నెల్లూరులో హై అలెర్ట్..!

image

ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, త్వరలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నెల్లూరు సిటీలోనూ అమలులో ఉందని DSP శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

News May 20, 2024

పశువుల అక్రమ రవాణా చేస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ

image

జిల్లాలో పశువుల అక్రమ రవాణా, తరలింపు నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిగా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాధ్‌ను నియమిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు లేదా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ 91211 09406 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

News May 20, 2024

స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధం: వేణుగోపాల్ రెడ్డి

image

గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు భద్రపరచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధిస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, ఈవీఎంలు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News May 20, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్టినెన్స్ కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం, గుంటూరు మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.17239 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌ను జూన్ 3 వరకు, నం.17240 విశాఖపట్నం- గుంటూరు ట్రైన్‌ను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 20, 2024

అనకాపల్లి: ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన డీఐజీ

image

విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ అనకాపల్లి కలెక్టరేట్ సమీపంలో ఫ్యూచర్ వరల్డ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ను ఎస్పీ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌‌ల వద్ద భద్రత సిబ్బంది నిరంతరం ఉండాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.

News May 20, 2024

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై బస్సు బోల్తా

image

కార్వేటినగరం మండలం పుత్తూరు కనుమ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై ఓ ఆటోను తప్పించబోయిన కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

News May 20, 2024

పగో: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌కు రంగం సిద్ధం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సాగుకు జిల్లా వ్యవసాయధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,13,339 ఎకరాల్లో సంబంధించి పత్తి, చెరకు, వరి, వెరుశనగ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ పంపిణీకి సిద్ధం చేసింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. 90 శాతం సబ్సిడీపై ఏజెన్సీ రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News May 20, 2024

తాడిపత్రి అల్లర్లపై 7 కేసులు నమోదు

image

ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 7 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అందులో 728మంది ముద్దాయిలు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 396 మందిని గుర్తించగా 332మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 91మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.