Andhra Pradesh

News September 23, 2024

అనంతపురంలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్‌పై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. భార్యాభర్తల మృతి స్థానికంగా విషాదం నింపింది.

News September 23, 2024

మచిలీపట్నం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని EVMల గోడౌన్‌ను కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పక్షాల ప్రతినిథులతో కలిసి గోడౌన్‌లో భద్రపర్చిన EVMలు, వీవీ ప్యాడ్‌లను పరిశీలించారు. EVM గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

News September 23, 2024

VZM: మారేడుమిల్లిలో మరో మెడికో మృతి

image

మారేడుమిల్లి జలపాతంలో బాడంగి మండలం డొంకినవలసకు చెందిన బాలి అమృత గల్లంతై మృతి చెందింది. ఏలూరులో మెడిసిన్ చదుతున్న ఆమె.. స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. భారీ వర్షాల కారణంగా జలపాతం పొంగడంతో వాగులో కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం ఆమె మృతదేహం వెలికితీశారు. ఆమె తండ్రి రైల్వే బాలి శ్రీనివాసరావు గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు. కాగా.. ఇదే ప్రమాదంలో బొబ్బిలికి చెందిన కే.సౌమ్య మృతి చెందిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

News September 23, 2024

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు

image

అనంతపురం మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చారు. 2018లో పొలంలో ఉండగా శివారెడ్డి హత్యకు గురయ్యారు. నేరం రుజువు కావడంతో బాలకృష్ణ, రమేశ్, అశోక్, భాస్కర్, విజయ్ కుమార్, సూర్యనారాయణ, మహీంద్రలకు కోర్టు శిక్ష విధించింది.

News September 23, 2024

విజన్-2047 ప్లాన్‌పై అభిప్రాయాలను అందించండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్లాన్‌పై ప్రభుత్వానికి సూచనలు, అభిప్రాయాలను అందజేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ నుంచి http://swarnandhra.ap.gov.in/Suggestions. లింక్‌తో వచ్చే QR కోడ్‌ ద్వారా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు సంతకంతో కూడిన సర్టిఫికేట్‌ను స్వీకరించాలన్నారు. QR కోడ్‌ని స్కాన్ చేసే సలహాలు అందించాలని చెప్పారు.

News September 23, 2024

Way2News: కడప జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

ఉమ్మడి కడప జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News September 23, 2024

శ్రీశైలంలో హత్యకు గురైన మార్కాపురం యువకుడు

image

శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి మార్కాపురం వాసి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బతుకుతెరువు కోసం శ్రీశైలానికి వెళ్లిన ఆవుల అశోక్‌(32)ను ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో శనివారం రాత్రి అతడిని గొంతు కోసి దారుణ హత్య చేశారని తెలిపారు. ఆదివారం ఉదయం పేపర్లు ఏరుకునే వారు రక్తపు మడుగులో ఉన్న యువకుడిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

News September 23, 2024

ఏయూ: ఫార్మసీ పరీక్ష కేంద్రాలకు జంబ్లింగ్ విధానం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు. వివరాలకు ఏయూ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 23, 2024

ఈ ఫొటోలోని నేతను గుర్తుపట్టారా?

image

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నేత. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు సీఎంగా సేవలందించారు. విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలనలో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు శాసనసభ, ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికై 1999 ఎన్నికలలో ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 81 ఏళ్ల వయసులో 2001లో తుదిశ్వాస విడిచారు. ఆయనెవరో గుర్తుపట్టారా? ఆయన జన్మించిన గ్రామం పేరేంటి? కామెంట్ చేయండి.