Andhra Pradesh

News May 20, 2024

స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధం: వేణుగోపాల్ రెడ్డి

image

గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు భద్రపరచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధిస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, ఈవీఎంలు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News May 20, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్టినెన్స్ కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం, గుంటూరు మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.17239 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌ను జూన్ 3 వరకు, నం.17240 విశాఖపట్నం- గుంటూరు ట్రైన్‌ను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 20, 2024

అనకాపల్లి: ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన డీఐజీ

image

విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ అనకాపల్లి కలెక్టరేట్ సమీపంలో ఫ్యూచర్ వరల్డ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ను ఎస్పీ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌‌ల వద్ద భద్రత సిబ్బంది నిరంతరం ఉండాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.

News May 20, 2024

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై బస్సు బోల్తా

image

కార్వేటినగరం మండలం పుత్తూరు కనుమ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై ఓ ఆటోను తప్పించబోయిన కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

News May 20, 2024

పగో: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌కు రంగం సిద్ధం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సాగుకు జిల్లా వ్యవసాయధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,13,339 ఎకరాల్లో సంబంధించి పత్తి, చెరకు, వరి, వెరుశనగ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ పంపిణీకి సిద్ధం చేసింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. 90 శాతం సబ్సిడీపై ఏజెన్సీ రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News May 20, 2024

తాడిపత్రి అల్లర్లపై 7 కేసులు నమోదు

image

ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై 7 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అందులో 728మంది ముద్దాయిలు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 396 మందిని గుర్తించగా 332మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 91మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News May 20, 2024

వెంకటగిరి ఓటరు ఎటో..?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఈ సారి వెంకటగిరి పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. వాళ్లు ఎక్కువా. మేం తక్కువా అని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ సైతం రేగింది. ఈక్రమంలో అభ్యర్థులు ప్రత్యేకంగా చూసుకున్న పట్టణ ఓటర్లు ఎవరికి అండగా నిలిచారో..?

News May 20, 2024

జర్మనీ అథ్లెటిక్స్‌లో మెరిసిన విశాఖ అమ్మాయి

image

జర్మనీలో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజి సత్తాచాటింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో పసిడి సాధించింది. కేవలం13.06 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. గతేడాది కూడా జ్యోతినే విజేతగా నిలిచింది. దీంతో విశాఖ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 20, 2024

శ్రీకాకుళం: పెట్రోల్ బంకులకు జిల్లా కలెక్టర్ సూచనలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సీసాలు, క్యాన్‌ల ద్వారా పెట్రోల్ అమ్మకంపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం చేపట్టినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న 120 పెట్రోల్ బంకుల నుంచి
లూజ్ పెట్రోల్ విక్రయాలు చేయకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని డియస్ఓ బి.శాంతి శ్రీని ఆదేశించారు.

News May 20, 2024

విశాఖలో సందడి చేసిన ‘బిగ్ బ్రదర్’ చిత్ర యూనిట్

image

బిగ్ బ్రదర్ చిత్ర యూనిట్ సోమవారం విశాఖ నగరంలో సందడి చేసింది. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం భారీ విజయ సాధించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు మురళీమోహన్ ఆకాంక్షించారు. జి. సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.