Andhra Pradesh

News May 20, 2024

కడప: YVU దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

image

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ ప్రొ. చింతా సుధాకర్ తన ఛాంబర్‌లో సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఫ్రొ. వై.పి.వెంకట సుబ్బయ్యతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ఆధారంగా పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించామని అన్నారు. 8 సబ్జెక్టుల ఫలితాలు ప్రకటించారు.

News May 20, 2024

కృష్ణా: ‘ప్రతి 15 రోజులకు శాఖల వారీ సమీక్షలు’

image

జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News May 20, 2024

ఏలూరు: ‘జిల్లా ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

image

ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ 876, ప్రైవేటు ఐటీఐలలో 1,672 మొత్తం 2,548 సీట్లు ఉన్నట్లు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రజిత సోమవారం తెలిపారు. ఆమె మాట్లడుతూ..జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేటు ఐటీఐ కాలేజీలలో 100 శాతం అడ్మిషన్స్ కార్యచరణ చేపట్టామన్నారు. ఆయా ఐటీఐ ఖాళీలలో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 10లోపు సత్రంపాడులో దరఖాస్తులను అందజేయాలన్నారు.

News May 20, 2024

పల్నాడు అల్లర్లపై డీజీపీకి అందించిన నివేదికలో వివరాలివే..

image

ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల‌పై సిట్ బృందం నివేదిక రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. 581 మందిపై కేసు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 91 మందికి 41A నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్నట్లు తెలుస్తుంది.

News May 20, 2024

మెలియాపుట్టి: నాటుసారా ధ్వంసం

image

మెలియాపుట్టి మండలం పాత్రులలోవ, నెరేళ్లలోవ గ్రామాల్లో సోమవారం ఎస్ఈబీ దాడులు నిర్వహించారు. గ్రామాల్లోని కొండల ప్రాంతంలో తయారు చేస్తున్న 1300 లీటర్ల బెల్లం ఊటతో పాటు 50 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు టెక్కలి ఎస్ఈబీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీ.ఎస్ రాజశేఖర్ నాయుడు తెలిపారు. ఈ దాడుల్లో పాతపట్నం, మెలియాపుట్టి పోలీసులతో పాటు టెక్కలి ఎస్ఈబీ సిబ్బంది ఉన్నారు.

News May 20, 2024

తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: నెల్లూరు కలెక్టర్

image

వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరి నారాయణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటి వసతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

News May 20, 2024

తూ.గో: ALERT.. పిడుగులు పడే ఛాన్స్ ఉంది!

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాయంత్రం పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, బిక్కవోలు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఫోన్లకు మెసేజ్‌లు పంపారు.

News May 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

image

నాటుసారా స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఆదేశాలతో సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, ఎస్సైల ఆధ్వర్యంలో ‘కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎవరూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయరాదని హెచ్చరించారు.

News May 20, 2024

తిరుమలలో మరోసారి చిరుతల కలకలం

image

తిరుమలలో మరోసారి చిరుత పులుల సంచారం కలకలం రేపింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుత పులులు భక్తలకు కనిపించాయి. భక్తులలు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిసరాల్లో గాలిస్తున్నారు.

News May 20, 2024

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు

image

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు, రాజకీయ పార్టీలు, ఏ ఇతర సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.