Andhra Pradesh

News May 20, 2024

తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: నెల్లూరు కలెక్టర్

image

వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరి నారాయణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటి వసతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

News May 20, 2024

తూ.గో: ALERT.. పిడుగులు పడే ఛాన్స్ ఉంది!

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాయంత్రం పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, బిక్కవోలు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఫోన్లకు మెసేజ్‌లు పంపారు.

News May 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

image

నాటుసారా స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక ఆదేశాలతో సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, ఎస్సైల ఆధ్వర్యంలో ‘కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎవరూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయరాదని హెచ్చరించారు.

News May 20, 2024

తిరుమలలో మరోసారి చిరుతల కలకలం

image

తిరుమలలో మరోసారి చిరుత పులుల సంచారం కలకలం రేపింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుత పులులు భక్తలకు కనిపించాయి. భక్తులలు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిసరాల్లో గాలిస్తున్నారు.

News May 20, 2024

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు

image

కదిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు, రాజకీయ పార్టీలు, ఏ ఇతర సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 20, 2024

తుని రైల్వే స్టేషన్‌లో హీరో సాయిరాం శంకర్

image

తుని పట్టణ రైల్వే స్టేషన్‌లో సోమవారం సినీ హీరో సాయిరాం శంకర్ సందడి చేశారు. నర్సీపట్నంకు చెందిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్‌లో కనిపించారు. 143 చిత్రంతో పాటు పలు చిత్రాలలో ఆయన నటించారు. తుని రైల్వే స్టేషన్‌లో ఆయనను చూసి పలువురు సెల్ఫీలు దిగారు.

News May 20, 2024

గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసులు

image

పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని గురజాల, మాచర్ల నియోజక వర్గాలలోని పలు గ్రామాల్లో జరిగిన అల్లర్లపై ఐపీసీ 448, 427, 324, 147, 148, 341, 323, 324, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

News May 20, 2024

పకడ్బందీగా పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ: ఉదయ భాస్కరరావు

image

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు సంబంధిత అధికారులును ఆదేశించారు. సోమవారం ఏలూరులో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు సంబంధించి విధ్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలను కల్గకుండా పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు.

News May 20, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

image

కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ కొనసాగాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు కొనసాగించాలన్నారు.

News May 20, 2024

తిరుపతి DSPగా రవి మనోహరాచారి

image

తిరుపతి, చంద్రగిరిలో హింస చెలరేగడంతో పలువురు పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తవారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి డీఎస్పీగా రవిమనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సీఐగా విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా రామారావును నియమించింది. రవి మనోహరాచారి ఆధ్వర్యంలోనే తిరుపతి గొడవలపై సిట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.