Andhra Pradesh

News May 20, 2024

పల్నాడు: పోలీస్ శాఖలో పలువురికి పోస్టింగులు

image

పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో పలువురికి పోస్టింగులు ఇస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, పల్నాడు SB సీఐ-1గా బండారు సురేశ్ బాబు, SB సీఐ-2గా శోభన్ బాబు, కారంపూడి ఎస్సైగా.అమీర్, నాగార్జునసాగర్ ఎస్ఐగా ఎం.పట్టాభిని నియమించింది. అల్లర్ల నేపథ్యంలో ఇక్కడి పోలీసులపై ఇటీవల ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

News May 20, 2024

విశాఖ: మంచం పైనుంచి పడి మృతి

image

నిద్రలో ఉండగా మంచం పైనుంచి కిందపడిన ఘటనలో గిరిజనుడు మృతి చెందాడు. చింతపల్లి మండలం బౌడ గ్రామానికి చెందిన వి.శ్రీను ఆదివారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తుండగా మంచం నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం అయింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 20, 2024

తిరుపతి జిల్లాలో రీపోలింగ్ లేదు: కలెక్టర్

image

కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాతే EVMలు లెక్కిస్తామని.. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ ఉండదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో 4 చోట్ల రీపోలింగ్ జరిపించాలని చెవిరెడ్డి కోరిన విషయం తెలిసిందే.

News May 20, 2024

నాయుడుపేటలో రైలు ఢీకొని ఒకరు మృతి

image

నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న రైలు… పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

వినుకొండ: రైలు క్రింద పడి వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందాడు. మృతుడు బ్లూ కలర్ చొక్క, నల్ల రంగు పాయింట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వివరాల తెలిస్తే ఎవరైనా నరసరావుపేట రైల్వే ఎస్సై సుబ్బారావుని సంప్రదించాలని సూచించారు.

News May 20, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఉరవకొండ మండలం పాల్తూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విడపనకల్ మండలానికి చెందిన మల్లికార్జునాచారి (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉండబండ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 20, 2024

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి హౌస్ అరెస్ట్

image

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తోట మల్లేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సోమవారం బయలు దేరారు. అయితే కణితివూరులో పోలీసులు తిలక్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మల్లేష్ అంతిమయాత్రలో కూడా పాల్గొనకుండా చేయడంపై తిలక్ అసహనం వ్యక్తం చేశారు.

News May 20, 2024

విశాఖలో కొండెక్కిన చికెన్ ధర

image

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.

News May 20, 2024

కొమరోలు: 24 గంటలుగా నిలిచిపోయిన జియో సేవలు

image

కొమరోలు మండలం చింతలపల్లి గ్రామ సమీపంలోని జియో టవర్ సరిగా పనిచేయకపోవడంతో జియో సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి జియో టవర్ పని చేయకపోవడం వల్ల జియో సిగ్నల్ లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి జియో టవర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం చెన్నై, భువనేశ్వర్ (నెం.06073), జూన్ 11 నుంచి జూలై 2 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్, చెన్నై (నెం.06074) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.