Andhra Pradesh

News May 20, 2024

ఆస్పరిలో ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు

image

ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ డ్రైవర్‌కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. ఇంకెవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 20, 2024

విశాఖ: పోలింగ్‌లో రాష్ట్రంలోనే కొత్త రికార్డు

image

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. 90వ వార్డులోని 213 బూత్‌లో అత్యల్పంగా 7.74% పోలింగ్ నమోదు కాగా(620 మంది ఓటర్లుండగా కేవలం 48మంది ఓటేశారు).. 56వ వార్డులో 180 బూత్‌లో అత్యధికంగా 84.43% పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో 69.78 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోలిస్తే 11.59% అధికంగా పోలింగ్ జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక కొత్త రికార్డు.

News May 20, 2024

అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమరాపురం మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో ఆదివారం రాత్రి 75.8 మిల్లీమీటర్లు, కనగానపల్లి లో 74.8, రామగిరి లో 36.4, గుడిబండలో 21.6, లేపాక్షిలో 19.2, ఆగలి మండలంలో 18.6 మిల్లీమీటర్ల పొందుతున్న జిల్లాలోని 18 మండలాల్లో 389.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నారు.

News May 20, 2024

అనంత: ఈనెల 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీవీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్‌‌సైట్ లాగిన్‌‌లో డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News May 20, 2024

పెండ్లిమర్రి టాప్.. పెద్దముడియం లాస్ట్

image

శనివారం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు జిల్లాలో వర్షం కురిసింది. 32 మండలాల్లో చిరుజల్లుల నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని అత్యధికంగా పెండ్లిమర్రిలో 39.4 మి.మి., అత్యల్పంగా పెద్దముడియం మండలంలో 0.8 మి.మి. నమోదయింది. 10 మి.మి. తోపు వర్షపాతం 22 మండలాల్లో నమోదు కాగా.. 10 నుంచి 20 మి.మి. 6 మండలాలు, మరో 3 మండలాల్లో 20 మి.మి. పైగా వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.

News May 20, 2024

UPDATE: జంగారెడ్డిగూడెంలో ACCIDENT.. యువకుడు మృతి

image

జంగారెడ్డిగూడెం శివారు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వివరాలు.. పట్టణానికి చెందిన కోన సాయి (23) మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మిత్రుడు రాజ్‌కుమార్‌ను జగన్నాథపురంలో వదిలిపెట్టేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయి మృతిచెందగా గాయపడిన రాజ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు.

News May 20, 2024

అనంత: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం

image

అనంతపురం జిల్లా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ తెలిపారు. పరీక్ష ఫీజుతో పాటు తత్కాల్ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, ఆయా ప్రిన్సిపల్ ను కలిసి ఫీజు చెల్లించాలని సూచించారు.

News May 20, 2024

భారీ మెజారిటీతో గెలుస్తా: గంటా

image

జగన్ దుర్మార్గపు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వాల్తేరు క్లబ్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు తన విజయం కోసం శ్రమించారని పేర్కొన్నారు.

News May 20, 2024

మైపాడు: చిన్నారిని రక్షించిన పోలీసులు

image

ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో చిన్నారిని పోలీసులు వెతికిపట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం జరిగింది. నెల్లూరుకు చెందిన శివ కుటుంబ సభ్యులతో ఆదివారం బీచ్‌కు వచ్చారు. వారి కుమార్తె రక్షిత(5) బీచ్‌లో తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెరైన్ సీఐ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్‌లో ఒంటరిగా ఉన్న పాపను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

News May 20, 2024

తూ.గో.: ఎడ్లబండిలో మృతదేహం తరలింపు

image

తూ.గో. జిల్లా అడ్డతీగల మండలం దగ్గర తిమ్మాపురం పంచాయతీ పరిధి గడిచిన్నంపాలేనికి సరైన రహదారి లేక గ్రామస్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పెంటరావు అనారోగ్యంతో చికిత్సపొందుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని వాహనంలో తీసుకొద్దామంటే గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఎడ్లబండిలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.