Andhra Pradesh

News May 20, 2024

సింహాచలంలో 22న నృసింహ జయంతి

image

సింహాచలం శ్రీవరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన స్వామి వారి నృసింహ జయంతితో పాటు స్వామి జన్మ నక్షత్రం ఒకే రోజున వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజున స్వామివారి నృసింహ జయంతి, స్వాతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.హోమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని భక్తులకు ఆన్లైన్ లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News May 20, 2024

లంబసింగి, చెరువులవేనంలో అద్భుత అందాలు

image

లంబసింగికి సమీపంలోని చెరువులవేనంలో మండు వేసవిలోనూ మంచు అందాలు సందర్శకులను అలరిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో పది రోజులుగా తొలకరి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వారం రోజులుగా చెరువులవేనం, లంబసింగిలో మంచు అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు చెరువులవేనం చేరుకుని శ్వేత వర్ణంలో దట్టంగా పరుచుకున్న మంచు మేఘాలను వీక్షిస్తూ పరవశం చెందుతున్నారు.

News May 20, 2024

అనంతపురంలో ఈనెల 24 న డీసెట్ పరీక్ష

image

అనంతపురంలో ఈనెల 24 న ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష, (డీసెట్ ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ తెలిపారు. పట్టణంలోని ఎన్సీపీఎస్ఐ కేంద్రంలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు అందరూ కూడా విషయాన్ని గమనించాలని కోరారు.

News May 20, 2024

సింహాచలం: నేడు కూడా కొనసాగనున్న చందనం అరగదీత

image

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈనెల 23న స్వామికి రెండవ విడత 120 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న 40 కిలోలు, 19వ తేదీన37 కిలోల చందనాన్ని అరగదీసారు. సోమవారం కూడా చందనం అరగదీత కొనసాగుతుంది. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ చందనం అరగదీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

News May 20, 2024

ప.గో.: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ప.గో. జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. SI శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన త్రినాథ్ ప్రసాద్‌‌కు 15ఏళ్ల క్రితం సుస్మితతో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సుస్మిత ఉరేసుకొని చనిపోయిందని ఆమె తండ్రికి ఫోన్లో చెప్పాడు. కూతురి మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలే అంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News May 20, 2024

అన్నమయ్య: బంగారాన్ని మెరుగు పట్టిస్తానని మోసం చేశారు

image

గాలివీడు మండల పరిధిలోని ఎర్రయ్యగారిపల్లిలో బిహార్‌కు చెందిన సంకట్ కుమార్, సుభాష్ కుమార్లపై చీటింగ్ కేసునమోదు చేసినట్లు ఎస్సై వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని నీల నాగమునెమ్మ అనే మహిళ బంగారాన్ని మెరుగు పట్టించి ఇస్తామని చెప్పి 33 గ్రాముల బంగారు తీసుకొని 20 గ్రాములకు తగ్గించి మోసం చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

News May 20, 2024

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు 144 సెక్షన్: ఎస్పీ

image

ఎన్నికలు తుది ఫలితాలు వరకు 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని శ్రీకాకళం ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు, ముద్దాయిలు అరెస్టు, ప్రాపర్టీ సీజ్ తదితర అంశాలపై ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీకెట్లు నియమించాలని సూచించారు.

News May 20, 2024

ప్రకాశం: రెండేళ్లల్లో 45 మంది మృతి

image

ఒంగోలు-కర్నూలు రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. చీమకుర్తి, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గడిచిన రెండేళ్లలో 120కి పైగా రోడ్డు ప్రమాదాలు, 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలు కూడా నడుస్తుంటాయి. ఇప్పటికే ఆ రోడ్డులో 16 బ్లాక్ స్పాట్‌లు గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆ రోడ్డు అంటే కొంతమందికి భయమే.

News May 20, 2024

విజయనగరం: పాము కాటుతో వ్యక్తి మృతి

image

పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్.కోట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కరెడ్ల చిన్నారావు(60) పొలంలో పనిచేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి ఎస్.కోట తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

SUPER: థాయిలాండ్‌‌లో టైటిల్ కొట్టేసిన కోనసీమ కుర్రోడు 

image

థాయిలాండ్‌లో ఆదివారం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. టైటిల్ ఫైట్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 21-15 స్కోరుతో చైనా క్రీడాకారులు చెన్-లు జంటపై గెలిచి రూ.26 లక్షల నగదు బహుమతితోపాటు ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ తెలిపారు. కాగా సాత్విక్ సాయిరాజ్‌ది మన కోనసీమ జిల్లా అమలాపురం అన్న విషయం తెలిసిందే.