Andhra Pradesh

News May 20, 2024

కొత్తపట్నంలో దారుణ హత్య

image

గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కొత్తపట్నం మండలం రెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాంబశివ రావు వివరాల మేరకు రెడ్డిపాలెంకు చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో నాగేశ్వరమ్మ హత్యకు గురైనట్లు భావించి కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

News May 20, 2024

ఆదోని: ప్రబలుతున్న అతిసారం.. కారణమిదే..!

image

ఆదోని మండల పరిధిలోని ఇస్వీ గ్రామంలో అతిసారం ప్రబలడంతో 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంచినీరు శుద్ధిలేక ఈ వ్యాధి ప్రబలినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో గతంలో కూడా అతిసారంలో కొందకు మృతి చెందిన విషయం తెలిసిందే..!

News May 20, 2024

కడప: సచివాలయం సమీపంలో మృతదేహం కలకలం

image

గోపవరం మండలం రాచాయపేట సచివాలయం సమీపంలో బల్లపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు బద్వేలు రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్ట్ మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 20, 2024

కృష్ణా: వైసీపీ హ్యాట్రిక్‌కు ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు ఇవే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, పామర్రు వైసీపీకి హ్యాట్రిక్ రేసులో ఉన్నాయి. గతంలో జరిగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ రెండు పర్యాయాలు గెలిచి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందో, కూటమి గెలిచి వైసీపీ హ్యాట్రిక్‌ను అడ్డుకుంటుందో చూడాలి. మరి మీ కామెంట్.

News May 20, 2024

పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్

image

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై EC దృష్టి సారించింది. హింసకు తావున్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పిఠాపురం నియోజకవర్గంలో కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కౌంటింగ్‌కు ముందే ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయనున్నారు.

News May 20, 2024

పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలపై ఫోకస్

image

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై EC దృష్టి సారించింది. హింసకు తావున్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కౌంటింగ్‌కు ముందే ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయనున్నారు.

News May 20, 2024

బుక్కరాయసముద్రం: ఈతకు వెళ్లి  బాలుడి మృతి

image

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదం అలుముకుంది. ఆదివారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్ బాషా (12) స్నేహితులలో కలిసి చిక్కవదియర్ చెరువులో ఈతకు వెళ్లి… ప్రమాదవ శాత్తు నీటి గుంటలో పడి మునిగిపోయాడు. పక్కనున్న పిల్లలు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా..వారు గాలించి బయటకు తీసి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

తూ.గో: గోదావరిలో స్నానానికి దిగి బాలుడి మృతి

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద స్నానానికి దిగి ఓ బాలుడు మృతిచెందాడు. మృతుడు రాజమండ్రిలోని శాంతినగర్‌కు చెందిన దడాల దినేశ్(16)గా పోలీసులు గుర్తించారు. బొబ్బర్లంక బ్యారేజీ దిగువన గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడని తెలిపారు. ఈ వారంలో ఇదే గోదావరిలో గల్లంతై వాడపల్లి, రావులపాలెం వద్ద ఆరుగురు మృతి చెందగా.. ఇది ఏడవ మరణం.

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు రూ.100

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

కనిగిరి: టీ తాగేందెకు వెళ్లి.. చనిపోయాడు

image

కనిగిరిలో ఆటో, కారు ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ ఇంకొకరు చనిపోయారు. వీరిలో కనిగిరి మున్సిపాలిటీలోని కాశీరెడ్డికాలనీకి చెందిన విష్ణునారాయణ చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. తెల్లవారుజామున టీ తాగేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని భార్య రమాదేవి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.