Andhra Pradesh

News May 20, 2024

గుంటూరు: కొండెక్కిన పచ్చిమిర్చి ధర రూ.100

image

నిత్యావసరంగా వాడుకునే పచ్చి మిర్చి ధర ఘాటెక్కింది. ఈ నెల తొలి వారంలో కిలో రూ.30 ఉన్న పచ్చి మిర్చి రెండో వారానికి రూ.60, ఇప్పుడు ఏకంగా రూ.100కు చేరుకుంది. తెనాలి ప్రాంతానికి బాపట్ల, రాంభొట్లవారిపాలెం తదితర ప్రాంతాల నుంచి మిర్చి వస్తుంది. ఆయా ప్రాంతాల్లో పంట ఇంకా అందుబాటులోకి రాలేదు. సరకు తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో ధర పెరిగింది.

News May 20, 2024

విశాఖ యువతి మోసం.. ఫినాయిల్ తాగిన యువకుడు

image

ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిమ్మాపూర్‌కు చెందిన నాగరాజు యోగా నేర్చుకునేందుకు ఈశా ఫౌండేషన్‌లో చేరాడు. అక్కడ వైజాగ్‌కు చెందిన సంధ్య ప్రియాంకతో ఏర్పడ్డ పరిచయం, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువతి రూ.16లక్షలు తన బంధువుల ఖాతాలోకి వేయించింది. మోసాన్ని తట్టుకోలేక ఫినాయిల్ తాగిన యవకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

News May 20, 2024

కడప: 20 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక

image

ముద్దనూరు మండలం రాజుల గురువాయుపల్లె ఉన్నత పాఠశాలలో 2004వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 సంవత్సరాల క్రితం పాఠాలు నేర్పిన గురువులను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో చేసినటువంటి పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

News May 20, 2024

కర్నూలు: మూడు మృతదేహాలపై వీడని సస్పెన్స్

image

గార్గేయపురం పరిధిలోని నగరవరం చెరువులో మొదట రెండు, కాసేపటికి మరో మహిళల మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే ఆ మూడు మృతదేహాలు ఎవరివనే విషయంపై ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తులు ఆ ప్రాంతాలకు రాత్రిపూట ఎక్కువగా వస్తారని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతులు తెలంగాణ వాసులుగా పోలీసులు అనుమానిస్తూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News May 20, 2024

కుప్పం మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

image

కుప్పం మాజీ ఎమ్మెల్యే వెంకటేశం కుమారుడు డీవీ చంద్రశేఖర్(72) కన్నుమూశారు. నిన్న రాత్రి 12:20 గంటలకు ఆయన స్వగ్రామం గుండ్ల సాగరంలో అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1967, 1972లో వరుసగా రెండుసార్లు వెంకటేశం కుప్పం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News May 20, 2024

శ్రీకాకుళంలో ఈఏపీ సెట్‌కు 999 మంది హాజరు

image

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ 25-2024 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. ఎచ్చెర్లలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలోని ఒక కేంద్రం, టెక్కలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో 999 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

ప.గో.: వేధింపులపై మహిళ ఫిర్యాదు

image

తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబురావు ఆదివారం తెలిపారు. ద్వారపూడికి చెందిన సారాదేవికి కొవ్వూరుకు చెందిన విజయ్ కుమార్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. నెలరోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత విజయ్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

News May 20, 2024

నరసన్నపేటలో మేకల దొంగలు

image

నరసన్నపేట మండలం చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పశువుల శాలలో కట్టిన 55 మేకల్లో 30 మూగజీవాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News May 20, 2024

విజయనగరం: నేడే పైడితల్లమ్మ దేవరోత్సవం

image

నేడు జరగనున్న పైడితల్లి అమ్మవారి దేవరోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ఆలయ ప్రదక్షిణ అనంతరం సా.5గంటలకు ఊరేగింపుగా హుకుంపేట తీసుకొస్తారు. అక్కడ నుంచి ఘటాలతో మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట, పార్కుగేటు, శివాలయం వీధి మీదుగా ఊరేగింపుతో మూడులాంతర్ల చదురుగుడికి తీసుకొస్తారు. వచ్చే రెండువారాల వరకు అమ్మవారు అక్కడే పూజలందుకుంటారు.