Andhra Pradesh

News May 20, 2024

తూ.గో.: నకిలీ ఖాతాతో వేధింపులు.. ఇద్దరిపై కేసు 

image

నకిలీ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి అర్ధ నగ్నచిత్రాలు పంపిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని నిడదవోలు SI అప్పారావు ఆదివారం తెలిపారు. తూ.గో. జిల్లా సమిశ్రగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ పట్టణంలోని ఓ వివాహిత పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి మరో మహిళ ఫోన్‌కు మహిళల అర్ధనగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపించారు. వివాహితకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News May 20, 2024

ప్రతిభ కనబరిచిన పొదిలి విద్యార్థులు

image

ప్రకాశం జిల్లా చెస్ టోర్నమెంట్‌లో పొదిలికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆదివారం ఒంగోలు భాగ్య నగర్‌లోని జెకె రాజు చెస్ అకాడమీలో జరిగిన అండర్ 7 బాలిక, అండర్ ఓపెన్ విభాగాల్లో పొదిలి సంస్కృతి విద్యా సంస్థలకు చెందిన జె పాణ్య శ్రీవల్లి, జె విఘ్నేష్ గుప్తా, నిహల్, విహల్‌లు రజత పతకాలను సాధించారు. ఈ విద్యార్థులను పలువురు అభినందించారు.

News May 20, 2024

అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం: నెల్లూరు ఎస్పీ

image

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని నవాబ్ పేట, కావలి 1 టౌన్, కావలి 2 టౌన్, కావలి రూరల్, ఉదయగిరి, వింజమూరు పరిధిలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

News May 20, 2024

24, 31న కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కర్నూల్ కలెక్టర్ 

image

24, 31వ తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ, ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్‌లో నిర్దేశించిన విధంగా 17సీ, పిఓ డైరీ, 17ఏ తదితర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

News May 20, 2024

పెట్రోల్ బంక్ యజమానులకు అనంత ఎస్పీ హెచ్చరికలు  

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

News May 20, 2024

రాయచోటి: కౌటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

image

సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావుతో కలిసి ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలన్నారు.

News May 20, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే లాస్ట్: ఆర్ఐవో

image

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించ లేకపోయిన విద్యార్థులు సోమవారం చెల్లించాలని ఆర్ఐవో ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో తత్కాల్ పథకం కింద రూ.3000 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. SHARE IT..

News May 20, 2024

దాడుల ఘటనలపై 72 మంది అరెస్ట్: బాపట్ల ఎస్పీ

image

చీరాల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసి పలువురి అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కూటమి అభ్యర్థి కొండయ్య వాహనంపై దాడి ఘటనపై ఆరుగురిని, మరొక ఘటనపై ఐదుగురిని, అలాగే చీరాల వేటపాలెం మండలంలో చోటు చేసుకున్న ఘటనలపై ఐదు కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News May 20, 2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి 62వ ర్యాంకు

image

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థి 62వ ర్యాంకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిన ప్రణవ్ సాయి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 132.4 మార్కులు సాధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 62వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని పలువురు స్థానికులు అభినందించారు.

News May 20, 2024

అలాంటి మామిడి పండ్లు ప్రమాదకరం: అనంతరావు

image

మామిడి వ్యాపారులు కొంతమంది చట్టవిరుద్ధంగా కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి కాయలను కృత్రిమంగా పండించి మార్కెట్‌లో అమ్ముతున్నారని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు అన్నారు. ఆదివారం స్థానిక కన్స్యూమర్ వాయిస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనంతరావు మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ అనేది ప్రమాదకరమైన రసాయనమని,  దాని వలన మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చిరించారు.