Andhra Pradesh

News May 20, 2024

బాధ్యతలు స్వీకరించిన పల్నాడు నూతన కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జయింట్ కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

News May 20, 2024

అనకాపల్లి: సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ

image

వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ర్యాలీలు, ఊరేగింపులు పండగల్లో స్టేజ్ ప్రోగ్రాములకు అనుమతులు లేవన్నారు. పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు అనుమతించకూడదన్నారు.

News May 20, 2024

విజయనగరం: 24న DEECET పరీక్ష

image

ఈ నెల 24న DEECET-2024 పరీక్షను గాజులరేగలో ఐయాన్ డిజిటల్ జోన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను cse.ap.gov.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

News May 20, 2024

విజయవాడ: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం (ERS), హెచ్. నిజాముద్దీన్(NZM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06071 ERS- NZM ట్రైన్‌లను జూన్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం, నం.06072 NZM- ERS ట్రైన్‌లను జూన్ 10 నుంచి జూలై 7 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, చిత్తూరు, తిరుపతి తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News May 19, 2024

ఏలూరు: 25 ఏళ్లకు తీరిన ఊరి కల..!

image

ఏలూరు జిల్లాలో 25 ఏళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఓ గ్రామానికి చేతి బోరింగ్ అందుబాటులోకి వచ్చింది. కుక్కునూరు మండలం కురుములతోగు గ్రామంలో తాగునీరు దొరక్క.. అక్కడి వారు 25 ఏళ్లుగా గుంతల్లో ఊరిన నీరే తాగుతూ జీవిస్తున్నారు. నీటి కలుషితంతో గతంలో రెండేళ్ల బాలుడు, వృద్ధుడు మృతి చెందారు. 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన అధికారులు 3 రోజుల కింద చేతిపంపు ఏర్పాటు చేశారు.

News May 19, 2024

NLR: రాయితీపై పంపిణీకి సిద్ధంగా వరి విత్తనాలు

image

ఖరీఫ్ సీజన్‌లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు, వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 19, 2024

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన శివ శంకర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్లోనే వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తారని బాలాజీ తెలిపారు.

News May 19, 2024

గంపలగూడెంలో విద్యుత్ షాక్.. భార్యాభర్తల మృతి

image

గంపలగూడెం పడమట దళితవాడకు చెందిన గోరంట్ల తిరపయ్య, భార్య జమలమ్మలు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రేకుల షెడ్డుపై ఉన్న సర్వీస్ వైరుకు, బట్టల ఆరేసుకునే జీఐ వైర్ దగ్గరగా ఉండటంతో షాక్ వచ్చింది. అయితే బట్టలు తీసే ప్రయత్నంలో జములమ్మ (48) షాక్‌కు గురికాగా, గమనించిన భర్త తిరుపతయ్య (52) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News May 19, 2024

పెట్రోల్ బంక్ యజమానులకు అనంత ఎస్పీ హెచ్చరికలు  

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

News May 19, 2024

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

image

కొవ్వూరు మండలం కాపవరం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నందమూరు- కాపవరం సర్వీసు రోడ్డులో ఓ వ్యాన్, ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొవ్వూరులోని ఇందిరమ్మకాలనీకి చెందిన పూర్ణసాయి కార్తీక్ మృతి చెందగా.. కరగాని గణేష్, కురందాసు దుర్గ గాయపడ్డారు. వీరిని కొవ్వూరు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు.