Andhra Pradesh

News May 19, 2024

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన శివ శంకర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్లోనే వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తారని బాలాజీ తెలిపారు.

News May 19, 2024

గంపలగూడెంలో విద్యుత్ షాక్.. భార్యాభర్తల మృతి

image

గంపలగూడెం పడమట దళితవాడకు చెందిన గోరంట్ల తిరపయ్య, భార్య జమలమ్మలు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రేకుల షెడ్డుపై ఉన్న సర్వీస్ వైరుకు, బట్టల ఆరేసుకునే జీఐ వైర్ దగ్గరగా ఉండటంతో షాక్ వచ్చింది. అయితే బట్టలు తీసే ప్రయత్నంలో జములమ్మ (48) షాక్‌కు గురికాగా, గమనించిన భర్త తిరుపతయ్య (52) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News May 19, 2024

పెట్రోల్ బంక్ యజమానులకు అనంత ఎస్పీ హెచ్చరికలు  

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

News May 19, 2024

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

image

కొవ్వూరు మండలం కాపవరం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నందమూరు- కాపవరం సర్వీసు రోడ్డులో ఓ వ్యాన్, ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొవ్వూరులోని ఇందిరమ్మకాలనీకి చెందిన పూర్ణసాయి కార్తీక్ మృతి చెందగా.. కరగాని గణేష్, కురందాసు దుర్గ గాయపడ్డారు. వీరిని కొవ్వూరు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు.

News May 19, 2024

ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.

News May 19, 2024

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

కర్నూలులోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుకు చెందిన పాండు స్థానికంగా ఉన్న ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కూరగాయలు తీసుకువచ్చేందుకు రోడ్డుపైకి వచ్చిన పాండును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో పాండు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 19, 2024

లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్: గుంటూరు ఎస్పీ

image

జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. ఆదివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా.. ఎక్కడా నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా కాల్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News May 19, 2024

ప్రకాశం: నెమలిగుండానికి చేరుకుంటున్న వరద నీరు

image

రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. కొద్దిరోజులుగా ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటి గుండానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం నీటి గుండాన్ని సందర్శించేందుకు సందర్శకులు ఆలయానికి పోటెత్తారు. వేసవికాలంలో నీటి గుండానికి నీరు వచ్చి చేరుతుండడంపై సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News May 19, 2024

వెంకన్నపాలెంలో యువకుడి మృతదేహం లభ్యం

image

చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం యువకుడి మృతదేహం లభ్యమయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన గనిశెట్టి నానాజీగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నానాజీ ఈనెల 14న మిస్ అయినట్లు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా ఉరి వేసుకుని మృతదేహంగా లభ్యమవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 19, 2024

విక్టోరియా మహారాణి గెస్ట్ హౌస్‌కు 137 ఏళ్లు

image

ఉదయగిరి పట్టణంలోని విక్టోరియా మహారాణి గెస్ట్ హౌస్ 137 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1887లో ఉదయగిరికి మహారాణి ఆటవిడుపుగా వచ్చారు. ఈక్రమంలో అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో అది లైబ్రరీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఈ గ్రంథాలయం మేధోశక్తిని అందజేస్తూ వస్తోంది.