Andhra Pradesh

News May 19, 2024

ప్రకాశం: రైలు పట్టాలపై మృతదేహం

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామ సమీపాన గల రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. రైలు పట్టాల మధ్య సదరు వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుడి వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 19, 2024

పాడేరులో వెల్లువిరిసిన ఇంద్రధనస్సు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఇంద్రధనస్సు వెల్లువిరిచినట్లు ఆకట్టుకుంది. ఆదివారం ఉదయం నుంచి పాడేరులో వర్షం కురిసింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారి ఓ పక్కన ఎండ మరో పక్కన పచ్చని కొండల మధ్య ఇంద్రధనస్సు మెరిసి చూసే వాళ్లకు కనువిందు చేసింది.

News May 19, 2024

కడప: శతాధిక వృద్ధురాలు శంఖుపల్లి చెన్నమ్మ (102) మృతి

image

కమలాపురానికి చెందిన శతాధిక వృద్ధురాలు శంఖుపల్లి చెన్నమ్మ (102) ఆదివారం మృతి చెందారు. కమలాపురంలో కుమార్తె చిట్టెం లక్షుమ్మ వద్ద చెన్నమ్మ ఉంటున్నారు. శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ సాధారణంగా స్వయంగా రోజువారీ దినచర్యను తానే స్వతహాగా చేసుకొనేది అని కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో అనారోగ్యానికి గురై కడప రిమ్స్ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు.

News May 19, 2024

పెట్రోల్ బంక్ ఓనర్లను బ్లేడు బ్యాచ్ బెదిరించలేదు: సీపీ

image

విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో, చానెళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. విజయవాడకు చెందిన బొజ్జ డానియల్ అనే వ్యక్తి బాటిల్లో పెట్రోల్ కొట్టమని పలు బంకుల వద్దకు వెళ్లి సిబ్బందిని అడిగినట్లు చెప్పారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో డానియల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 19, 2024

ఉదయగిరి ఆనకట్టపై పసికందు డెడ్‌బాడీ.. ఏం జరిగిందంటే..?

image

ఉదయగిరి ఆనకట్టపై నేటి ఉదయం <<13274062>>లభ్యమైన పసికందు వివరాలు తెలిశాయి. <<>>పోలీసుల విచారణ నేపథ్యంలో ఉదయగిరి మండల పరిధిలోని ఆర్లపడియ ఎస్టీ కాలనీకి చెందిన ఓ మహిళ.. కాన్పు కోసం ఉదయగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు వచ్చిందన్నారు. కాన్పు సమయంలో పుట్టిన బిడ్డ మృతి చెందడంతో వారు ఆ పసికందును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని పూడ్చి పెట్టకుండా ఆనకట్ట వద్ద పడేసినట్లు తెలిసింది.

News May 19, 2024

కోనసీమ: తీవ్ర విషాదం.. 3వ మృతదేహం లభ్యం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గౌతమి గోదావరిలో శనివారం <<13271997>>గల్లంతైన ముగ్గురిలో<<>> మూడో మృతదేహం ఆదివారం లభ్యమైంది. సత్తి సంపత్‌రెడ్డి(16)గా గుర్తించారు. నిన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారిలో పెంట జయకుమార్(19), సబ్బెల్ల ఈశ్వర్ రెడ్డి(20) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు వద్ద సంపత్ రెడ్డి డెడ్‌బాడీ లభ్యమైంది.

News May 19, 2024

కడప: ఓవర్ టేక్ చేయబోయి వ్యక్తి మృతి

image

రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి దగ్గర ముందు పోతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మైసూరు వారి పల్లి హరిజనవాడకు చెందిన చలమల నరసింహులు ఆదెమ్మల కుమారుడు పెంచలయ్య (30)గా పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి హరిజనవాడలో ఉన్న అక్క దగ్గరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 19, 2024

ప్రతిభ ఉంటే సినిమా రంగంలో మంచి గుర్తింపు: సంజయ్

image

ప్రతిభ ఉంటే సినిమా రంగంలో గుర్తింపు లభిస్తుందని సినీ నటుడు బలగం సంజయ్ కృష్ణ తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించానన్నారు. బలగం, గుంటూరు కారం చిత్రాలు మంచి గుర్తింపు ఇచ్చాయన్నారు .

News May 19, 2024

కొనకళ్ళను పరామర్శించిన వైసీపీ MLA పేర్ని నాని

image

హార్ట్ స్ట్రోక్‌కి గురై శస్త్ర చికిత్స చేసిన అనంతరం విజయవాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో కోలుకుంటున్న, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పరామర్శించారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News May 19, 2024

శ్రీకాకుళం: నదికి వెళ్లి.. అనంత లోకాలకు..!

image

శ్రీకాకుళం నగరంలోని బాదుర్లపేటకు చెందిన పి.రమేశ్(18) మృత్యువాత పడ్డాడు. నగరంలోని నాగావళి నదికి స్నేహితులతో కలిసి రమేశ్ ఆదివారం స్నానానికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకొని ప్రమాదవశాత్తు అతడు మునిగిపోయాడు. నీటిలో మునగడంతో వెంటనే అతడిని బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.