Andhra Pradesh

News May 19, 2024

కోనసీమ: తీవ్ర విషాదం.. 3వ మృతదేహం లభ్యం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గౌతమి గోదావరిలో శనివారం <<13271997>>గల్లంతైన ముగ్గురిలో<<>> మూడో మృతదేహం ఆదివారం లభ్యమైంది. సత్తి సంపత్‌రెడ్డి(16)గా గుర్తించారు. నిన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారిలో పెంట జయకుమార్(19), సబ్బెల్ల ఈశ్వర్ రెడ్డి(20) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు వద్ద సంపత్ రెడ్డి డెడ్‌బాడీ లభ్యమైంది.

News May 19, 2024

కడప: ఓవర్ టేక్ చేయబోయి వ్యక్తి మృతి

image

రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి దగ్గర ముందు పోతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మైసూరు వారి పల్లి హరిజనవాడకు చెందిన చలమల నరసింహులు ఆదెమ్మల కుమారుడు పెంచలయ్య (30)గా పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి హరిజనవాడలో ఉన్న అక్క దగ్గరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 19, 2024

ప్రతిభ ఉంటే సినిమా రంగంలో మంచి గుర్తింపు: సంజయ్

image

ప్రతిభ ఉంటే సినిమా రంగంలో గుర్తింపు లభిస్తుందని సినీ నటుడు బలగం సంజయ్ కృష్ణ తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించానన్నారు. బలగం, గుంటూరు కారం చిత్రాలు మంచి గుర్తింపు ఇచ్చాయన్నారు .

News May 19, 2024

కొనకళ్ళను పరామర్శించిన వైసీపీ MLA పేర్ని నాని

image

హార్ట్ స్ట్రోక్‌కి గురై శస్త్ర చికిత్స చేసిన అనంతరం విజయవాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో కోలుకుంటున్న, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పరామర్శించారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News May 19, 2024

శ్రీకాకుళం: నదికి వెళ్లి.. అనంత లోకాలకు..!

image

శ్రీకాకుళం నగరంలోని బాదుర్లపేటకు చెందిన పి.రమేశ్(18) మృత్యువాత పడ్డాడు. నగరంలోని నాగావళి నదికి స్నేహితులతో కలిసి రమేశ్ ఆదివారం స్నానానికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకొని ప్రమాదవశాత్తు అతడు మునిగిపోయాడు. నీటిలో మునగడంతో వెంటనే అతడిని బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News May 19, 2024

రాయితీపై పంపిణీకి సిద్ధంగా విత్తనాలు

image

NLR: ఖరీఫ్ సీజన్‌లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 19, 2024

వామ్మో.. ముంబై రోడ్డుపై ప్రయాణమా..!

image

నెల్లూరు-ముంబై రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బుచ్చిరెడ్డిపాళెం, సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాల పరిధిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రమాదాలకు ఆగి ఉన్న వాహనాలే కారణమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా పరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News May 19, 2024

పూతలపట్టు: స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత

image

పూతలపట్టు మండలం ఎస్.వి సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుతో కలిసి ఎస్.వి.సెట్‌‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత చేసినట్లు చెప్పారు.

News May 19, 2024

కంభం చెరువు ప్రకృతి అందాలు చూశారా..!

image

జిల్లాలోని కంభం చెరువుకు విశిష్టత ప్రపంచంలోనే చెప్పుకోదగ్గది. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువుగా కంభం చెరువుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెరువు వద్ద ప్రకృతి అందాలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటుంటాయి. అందుకే సెలవు దినాలు వచ్చాయంటే చాలు కంభం చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో సందర్శకులు చేరుకుంటారు. అంతేకాదు మరికొందరు ఇక్కడ చేపలను సైతం వలల సహాయంతో వేట కొనసాగిస్తారు.

News May 19, 2024

ఎలక్షన్ ఆధారిత కేసులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలి: ఎస్పీ

image

ఎలక్షన్ ఆధారిత కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలనీ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.