Andhra Pradesh

News May 19, 2024

నిప్పుల కుంపటిలా శ్రీకాకుళం  

image

శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. మే నెల కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం తీవ్రమైన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా 35-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాసలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. పలు మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.

News May 19, 2024

కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారు: కొణతాల

image

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, కూటమి జనసేన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. జిల్లాలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులందరూ భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అడపా నర్సింహ మూర్తి పాల్గొన్నారు.

News May 19, 2024

ప.గో.: ‘ఎన్నికల్లో డబ్బు అందిందా..?’

image

ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగ్గా జరిగిందా..? లేదా..? ప్రజలను అడిగి తెలుసుకునేందుకు పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన 20 మంది సభ్యుల బృందం పర్యటించినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఇంటింటికీ తిరిగి కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. అందరికీ డబ్బు అందిందా అని అడుగుతున్నారని టాక్. దీంతో కంగుతిన్న ప్రజలు ఇలాంటి విచారణ తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారట.

News May 19, 2024

విశాఖ: ఒక్క నెలలో రూ.76 లక్షల ఆదాయం..!

image

రావికమతం మండలం కళ్యాణపులోవలో 4 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి లక్షల రూపాయలు సంపాదించారు. 94 కుటుంబీకులు 110 ఎకరాల్లో జీడిమామిడి పంట ద్వారా ఈ ఏడాది ఒక్క నెలలోనే రూ.76,46,960లు సంపాదించుకున్నారు. ఆదివాసీల నాయకులు వీరిని చైతన్యవంతుల్ని చేసి వారి స్వశక్తి పైనే వ్యవసాయం చేసుకునేలా సహాయపడ్డారు.

News May 19, 2024

విజయనగరం: 42 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో 42 కేంద్రాల్లో నిర్వహించనున్నామని ఆర్ఐఓ ఆదినారాయణ తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 14,904, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 7,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News May 19, 2024

తూ.గో.: వేసవి.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

image

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321, 08322, 08325, 08326 నంబర్లు గల రైళ్ళ సేవలను మే 30 నుంచి జూన్‌ 29వ తేదీ వరకూ పొడిగించింది. ఈ రైళ్లు ఉమ్మడి తూ.గో జిల్లాలోని తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

News May 19, 2024

రాజుపాలెం: ట్రాక్టర్ పైనుంచి పడి ఉపాధి కూలి మృతి

image

రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలి వేంపల్లి సుబ్బరాయుడు (60) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. శనివారం ఉపాధి హామీ పథకం పనుల కోసం ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తుండగా ట్రాలీ డోర్ కున్న సపోర్టు కడ్డీ విరగడంతో సుబ్బరాయుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏపీడీ ఆనందం, ఏపీఓ లక్ష్మీనారాయణ సుబ్బరాయుడు మృతదేహానికి నివాళి అర్పించారు.

News May 19, 2024

ప.గో.: మరో 15 రోజులే.. మీ MLA ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MLA అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

రిలాక్స్ మూడ్‌లో పొలిటికల్ వారసులు

image

నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు కీలకపాత్ర పోషించారు. భార్యలతో పాటు కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు ఎండను సైతం లెక్కచేయక ఇల్లిల్లూ తిరిగారు. పోలింగ్ ముగియడంతో వారిలో ఎక్కువ శాతం మంది రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. పలువురు విదేశాలకు వెళ్లగా మరికొందరు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

News May 19, 2024

విజయనగరం: చెరువులో పడి బాలుడి మృతి

image

దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన మండాది గౌతం (10) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు పప్పల చెరువు వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కాలు జారి చెరువులోకి పడిపోయాడు. స్నేహితులు బయటకు తీసి 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ ఆదివారం తెలిపారు.