Andhra Pradesh

News May 19, 2024

తూ.గో.: మరో 15 రోజులే.. మీ MLA ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

విశాఖ: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఐఓ మురళీధర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు ఉన్న 172 జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు 31,152 మంది ఒకేషనల్ కోర్సులకు 636 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులకు 7,774 మంది ఒకేషనల్ కోర్సులకు 455 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

News May 19, 2024

ప.గో.: ఒకే మండలం నుంచి 8 మంది MLA అభ్యర్థులు

image

ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుంచి MLA అభ్యర్థులుగా బరిలో నిలిచిన 12 మందిలో 8 మంది బుట్టాయగూడెం మండలానికి చెందినవారే కావడం విశేషం. మిగతా నలుగురు జీలుగుమిల్లి మండలం వారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిది మండలంలోని దుద్దుకూరు కాగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దువ్వెల సృజనది ఇదే మండలంలోని కోయరాజమండ్రి గ్రామం. ఇక కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజుది జీలుగుమిల్లి మండలంలోని బర్రిలంకపాడు గ్రామం.

News May 19, 2024

ప్రకాశం: ధర తగ్గిన నిమ్మ.. దిగాలుపడిన రైతులు

image

జిల్లాలో నిమ్మ సాగు చేసిన రైతులు దిగాలు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 4వేల హెక్టార్లలో రైతులు నిమ్మ సాగు చేయగా, పంట దిగుబడి సైతం అధికంగా వచ్చింది. పంట దిగుబడిపై సంబరపడ్డ రైతులు, ప్రస్తుత మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూ.40 లు మాత్రమే ధర పలుకుతుండగా, పెట్టుబడి సైతం చేతికి అందే పరిస్థితి లేదని రైతులు తెలుపుతున్నారు.

News May 19, 2024

తెలంగాణ ఈఏపీసెట్‌లో అనంత వాసికి పదో ర్యాంకు

image

అనంతపురంలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పూల రాంప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె పూల దివ్యతేజ తెలంగాణ ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. గుండె వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని దివ్యతేజ తెలిపింది. ఆమె విజయవాడలో చదువుకుంది. పదో తరగతిలో 587, ఇంటర్‌లో 984 మార్కులు సాధించింది.

News May 19, 2024

గోనుపల్లికి పండగొచ్చింది..!

image

పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాపూరు మండలం గోనుపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. తమ ఇంటి అల్లుడైన నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల కోసం కోనకు బయలుదేరిన నేపథ్యంలో గోనుపల్లి గిరిజనులు సంప్రదాయ నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కోన వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. కోన తిరునాళ్ల సందర్భంగా గోనుపల్లి గిరిజనులు తమ ఇళ్ల వద్ద పందిర్లు వేసి ముగ్గులు తీర్చిదిద్దారు.

News May 19, 2024

తూ.గో.: భార్యతో వాగ్వాదం.. భర్త SUICIDE

image

HYDలోని బోరబండకు చెందిన నల్లమాటి సాయికుమార్‌(29)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 9న ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య రాజమండ్రికి వెళ్లింది. కాగా 17వ తేదీన సాయికుమార్ భార్యకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు బోరబండ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

News May 19, 2024

రైల్వేకోడూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రైల్వేకోడూరు మండలం కుక్కల దొడ్డి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముని గణేశ్ రెడ్డి (24) అనే యువకుడు చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైకుపై ముని గణేశ్ రెడ్డి రైల్వేకోడూరులో జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈరోజు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి, తొక్కించుకొని వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News May 19, 2024

అవి పులి పాదముద్రలు కావు: ఫారెస్ట్ అధికారులు

image

భోగాపురం మండలంలో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అటవీశాఖ అధికారులు స్పందించారు. దిబ్బలపాలెం ప్రాంతంలో సెక్షన్ అధికారి మధుమోహన్‌రావు శనివారం పర్యటించి పాదముద్రలు పరిశీలించారు. అవి పులి అడుగుజాడల్లానే ఉన్నా.. దుమ్మలగుండుగా పిలిచే హెన్నావిగా నిర్ధారించారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

News May 19, 2024

కాకినాడ: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

image

కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి పడేసినట్లు ఉంది. ఎవరో చంపి  ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.