Andhra Pradesh

News September 9, 2025

పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న మహారాణిపేట పోలీసులు

image

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయి షేక్ అబ్దుల్ కలాం 18 నెలల నుంచి కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా గాలించారు. సెల్‌ఫోన్ కూడా ఉపయోగించకుండా తిరుగుతున్న ముద్దాయిని మంగళవారం చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.

News September 9, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

News September 9, 2025

మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత ప్రచారం: VZM ఎస్పీ

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం ప్రచార రథం ద్వారా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. క్షేత్ర స్ధాయిలో ‘సంకల్ప రథం’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతతో పాటు డ్రగ్స్‌ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 9, 2025

శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News September 9, 2025

విశాఖ: ‘అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’

image

జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు 4 సార్లు అధ్యయన యాత్రలకు వెళ్లారని తెలిపారు. ఈనెల 15 నుంచి 23 వరకు మరోసారి అధ్యయన యాత్ర కోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేందుకు జీవీఎంసీ సిద్ధమైందన్నారు. గతంలో జరిగిన అధ్యయన యాత్రలు విహారయాత్రలుగా మిగిలాయన్నారు.

News September 9, 2025

కేజీహెచ్‌లో సిట్ విచారణ..?

image

సృష్టి కేసులో కేజీహెచ్‌ వైద్యుల వ్యవహారం నిగ్గు తేల్చేందుకు సిట్ రెండు రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్‌లో పనిచేసిన ముగ్గురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సిట్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లా వైద్యశాఖ నుంచి తెలంగాణ సీట్ పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం.

News September 9, 2025

అమరావతికి మరో ప్రముఖ సంస్థ

image

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు

News September 9, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

image

వందే భరత్ రైలు సర్వీస్‌ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.

News September 9, 2025

ఆలయంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ

image

మొగల్తూరులోని శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేర పరిశోధనలో నిపుణులైన FSL బృందం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక భద్రతా బృందాలు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాయన్నారు. తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

News September 9, 2025

ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.