Andhra Pradesh

News May 19, 2024

గుంటూరు: భార్య తల పగలకొట్టిన భర్తపై కేసు

image

భార్య తల పగలగొట్టిన భర్తపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కొండా వెంకటప్పయ్యకాలనీకి చెందిన వడ్డీ కాసులు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను గొడవ పెట్టుకుని ఇనుప రాడ్డుతో తల పగలగొట్టాడని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

News May 19, 2024

విశాఖ: చంద్రబాబును కలిసిన అనిత

image

సార్వత్రిక ఎన్నికలు అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు పాయకరావుపేట పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లు గురించి వివరించారు. పోలింగ్ సరళిని బట్టి విజయం సాధిస్తానని ఆమె చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల అనంతరం పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

News May 19, 2024

వట్టిచెరుకూరులో 45.6 మి.మీ. వర్షపాతం

image

గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా వట్టిచెరుకూరు మండలంలో 45.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్ష పాతం 9.4 మిల్లీ మీటర్లుగా ఉంది. ప్రత్తిపాడు 12.4, చేబ్రోలు 11.8, కాకుమాను 11.6, గుంటూరు తూర్పు 9.2, మేడికొండూరు 9.2, పెద కాకాని 9.2, తాడికొండ 9.2, పెదనందిపాడు 8.4, తుళ్లూరు 7.4, ఫిరంగిపురం 6.6, పొన్నూరు 5.2, దుగ్గిరాల 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News May 19, 2024

కూటమికి 160పైగా సీట్లు: కిమిడి

image

YCP ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చీపురుపల్లి TDP MLA అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమన్న ఆయన..1983,1994ఎన్నికల తరహాలో ఈసారి పెద్దఎత్తున ప్రభంజనం వచ్చిందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు, ప్రకృతిని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా YCP పాలించిందని ఆరోపించారు. జూన్ 9న విశాఖలో CMగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తామని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

News May 19, 2024

గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

వినుకొండ మండలం ఏనుగుపాలెంకి చెందిన శ్రీనివాస రావు, దేవి(30)దంపతులు. దేవి రోజు వెళ్లినట్లే శుక్రవారం తమ గేదేలను మేపటానికి పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన దేవి ఇంటికి రాలేదని భర్త శ్రీనివాసరావు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామ శివారులోని ఒక నీటికుంటలో ఆమె మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అదించగా.. ఘటనపూ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 19, 2024

కడప: రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం

image

కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని RPS నగర్లో నివాసం ఉంటున్న శేషం వెంకటేశ్వర్లు కుమారుడు ఈశ్వర ప్రసాద్, సోదరుడితో కలిసి శుక్రవారం మోటార్ సైకిల్ పై ఎర్రముక్కపల్లి కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పీఎఫ్ కార్యాలయం వద్ద మరో మోటార్ సైకిల్ ను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. దీంతో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఈశ్వర ప్రసాద్(12) మృతి చెందారు.

News May 19, 2024

సింహాచలం: నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు

image

సింహాచలం అప్పన్న ఆలయంలో ఆదివారం నుంచి నమ్మాళ్వార్ తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని అన్నారు.ఈనెల 22న నృసింహ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం ఐదు గంటల తర్వాత దర్శనాలు నిలిపివేస్తామన్నారు. తిరిగి 23 ఉదయం 7 గంటల తర్వాత దర్శనాలు లభిస్తాయన్నారు.

News May 19, 2024

అన్నవరం సత్యదేవుని కళ్యాణం.. నేటి కార్యక్రమాలు

image

అన్నవరం సత్యదేవుడి కళ్యాణోత్సవాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళ సూత్రాలు, చుట్లు, స్వామికి స్వర్ణ యజ్ఞోపవేతాలను మేళతాళాల మధ్య గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నుంచి తీసుకు వస్తారు. రాత్రి 7 గంటలకు స్వామిని వెండి గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, పెళ్లి పెద్దలైన సీతారాములను వెండి పల్లకీలో ఊరేగిస్తారు.

News May 19, 2024

గుంటూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News May 19, 2024

గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-2 మెయిన్స్ ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 60 మందిని ఎంపిక చేసి నెలరోజులు శిక్షణ అందిస్తరు.