Andhra Pradesh

News May 19, 2024

ప.గో.: తాను చనిపోయినా.. మరొకరికి ప్రాణం

image

ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.

News May 19, 2024

విశాఖ: ఫెడెక్స్ కొరియర్ మోసంపై 12 కేసులు నమోదు

image

సైబర్ మోసగాళ్లు ఫెడెక్స్ కొరియర్ పేరు మీద పలు మోసాలకు పాల్పడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ నగరంలో 12 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో బాధితులు రూ.5.93 కోట్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. బాధితులు సకాలంలో స్పందించి 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో రూ.1.04కోట్ల నగదును వేరే ఖాతాలకు మళ్లించకుండా అడ్డుకున్నామన్నారు.

News May 19, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్

image

ఆ భార్యాభర్తలు ఐపీయస్‌ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్‌పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్‌, వకుల్‌ జిందాల్‌లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

News May 19, 2024

పార్వతీపురం: తెలంగాణ ఎంసెట్‌లో శ్రీనిధి ప్రతిభ

image

కొమరాడ మండలం దళాయిపేటకి చెందిన ధనుకొండ శ్రీనిధి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం సారిపల్లి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. శ్రీనిధి పదో తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది. విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు.

News May 19, 2024

ఎన్టీఆర్: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా రాయనపాడు మీదుగా విశాఖపట్నం(VSKP), మహబూబ్‌నగర్(MBNR) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.12861 VSKP- MBNR ట్రైన్‌ను ఈ నెల 19 నుండి జూన్ 3 వరకు, నెం.12862 MBNR- VSKP ట్రైన్‌ను ఈ నెల 20 నుండి జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 19, 2024

కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి: వికాస్ మర్మత్

image

నెల్లూరులో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ ఎన్నికల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని ఆయన ఛాంబర్‌లో శనివారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు

News May 19, 2024

నంద్యాల: ఆ కళాశాలల వద్ద 144 సెక్షన్ అమలు

image

ఈవీఎం బాక్సులను భద్రపరిచిన ఆర్జీయం, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. శనివారం కళాశాలల్లో ఉంచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.

News May 19, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలించిన ఎన్నికల కమిషనర్

image

ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం శివాని కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడి సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరూ కౌంటింగ్ ప్రక్రియ వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక, డిఎస్పీ వై.శ్రుతి ఉన్నారు.

News May 19, 2024

ప.గో: కొత్తిమీర ధర కిలో రూ.100..!

image

కొత్తిమీర ధర వినియోగదారులను హడలెత్తిస్తోంది. ప.గో జిల్లా పెనుగొండ మండలంలోని పలు మార్కెట్లలో శనివారం కిలో కొత్తిమీర రూ.100 పలికిందని తెలిపారు. స్థానికంగా పంట లేకపోవడంతో బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు కొత్తిమీర దిగుమతి చేస్తున్నారని, దీంతో రవాణా ఛార్జీలతో కలుపుకొని కేజీ కట్ట రూ.100 పలుకుతోందని చెబుతున్నారు. ధర చూసిన వినియోగదారులు హడలెత్తిపోతున్నారు.

News May 19, 2024

వైజాగ్ వారియర్స్‌ టీంకు సామర్లకోట యువకుడు

image

ఆంధ్ర ప్రీమియర్ లీగ్- వైజాగ్ వారియర్స్‌కు కాకినాడ జిల్లా క్రీడాకారుడు పెంకె మణికంఠ గంగాధర్ ఎంపికయ్యాడు. సామర్లకోటలోని వీరరాఘవపురానికి చెందిన గంగాధర్ క్రికెట్‌లో మంచి ఆటతీరు కనబర్చడంతో ప్రీమియర్ వైజాగ్ వారియర్స్‌కు ఎంపిక చేసినట్లు క్రికెట్ సంఘం నేతలు వివరించారు. మణికంఠ ఎంపిక పట్ల జిల్లా క్రీడా సంఘం అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గంగాధర్‌కు అభినందనలు తెలిపారు.