Andhra Pradesh

News May 19, 2024

అల్లర్ల వీడియోలు ప్రసారం చేయొద్దు: తిరుమలరెడ్డి

image

ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి వీడియోలను ప్రసారం చేయరాదని చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి తిరుమలరెడ్డి శనివారం తెలిపారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలను పలు టీవీ ఛానల్స్ పదే పదే ప్రసారం చేస్తున్నాయని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రశాంతత నెలకొన్న గ్రామాల్లో మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలు పదే పదే ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా తిరుపతి, కాకినాడ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.17249 తిరుపతి- కాకినాడ టౌన్ ట్రైన్‌ను జూన్ 3 వరకు, నెం.17250 కాకినాడ టౌన్- తిరుపతి ట్రైన్‌లను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం

image

నైరుతీ రుతు పవనాలు ఈఏడాది ముందుగానే రావడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా జిల్లా వ్యాప్తంగా 3,70,307 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారలు అంచనా వేస్తున్నారు. సాగు విస్తీర్ణం బట్టి ఇప్పటికే మండలాల వారీగా విత్తనాలు కేటాయించినట్లు జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News May 19, 2024

విశాఖ: తాగునీటికి అంతరాయం.. జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ పరిధిలోని జోన్ -2 మే నెల 20న తాగునీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన తాగనీటి సరఫరా చేసే పనిలో భాగంగా, బోణి గ్రామం వద్ద ఉన్న కోస్తానని హేట్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 మీ.మీ మందం గల పైప్ లైన్లను వేస్తున్నట్లు వివరించారు. నగర వాశుల సహకరించాలని కోరారు.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య ప్రయాణించే రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నెం. 06095 తాంబరం-సత్రాగచ్చి
ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం, నెం.06096 సత్రాగచ్చి-తాంబరం ట్రైన్‌ను జూన్ 7 నుంచి జూలై 5 వరకూ ప్రతి శుక్రవారం పొడిగిస్తున్నట్లు SCR తెలిపింది.

News May 18, 2024

గుంతకల్లు: ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

image

గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)కు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం. 06077 ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News May 18, 2024

శ్రీకాకుళం: డ్యూటీ ధ్రువపత్రాలు అందించాలని వినతి

image

ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ డ్యూటీ ధ్రువపత్రాలు మంజూరు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో మనజీర్‌ జిలానీ సమూన్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్టర్‌ను సంఘం తరుపున అభినందనలు తెలిపారు.

News May 18, 2024

చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆర్ మల్లవరానికి చెందిన సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

News May 18, 2024

ముదినేపల్లిలో పగిలిన గ్యాస్ పైప్ లైన్

image

ముదినేపల్లిలో గురజ రహదారిలో మెగా సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఎదురుగా పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్ కుమార్, గుడివాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. మంటలు ఏర్పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.