Andhra Pradesh

News September 9, 2025

విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

image

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్‌లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.

News September 9, 2025

నెల్లూరు: రేషన్ డీలర్స్‌కి కొత్త మిషన్లు

image

నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల రేషన్ డీలర్స్‌కు ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మిషన్లను నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో అందజేశారు. వీటి ద్వారా సరుకులను సులభతరంగా ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గతంలో బటన్స్ నొక్కి ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు. కొత్త మిషన్లకు టచ్ స్క్రీన్ ఇవ్వడంతో నంబర్లను ఎంటర్ చేసేందుకు సులువుగా ఉంది. డివిజన్ పరిధిలో 300 వరకు మంగళవారం అందించినట్లు చెప్పారు.

News September 9, 2025

అనంత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై రాళ్ల దాడి

image

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.

News September 9, 2025

విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.

News September 9, 2025

పోలేరమ్మ జాతర నైవేద్యంతో ఆరోగ్యం

image

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా పెట్టే నైవేద్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపాకు అంటు వ్యాధులు ప్రబలకుండా వైరస్‌ను నివారిస్తుంది. సొంటి అన్నం వల్ల కడుపు శుద్ది చేయడంతో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. కుడుములు వల్ల ఊపిరితిత్తులు, కండరాలు, నరములకు శక్తి లభిస్తుంది. మునగాకు వల్ల జీర్ణశక్తి, జాయింట్ పెయిన్ రిలీఫ్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది.

News September 9, 2025

ఉదయగిరి: అంగన్వాడీలకు తప్పని రేషన్ తిప్పలు

image

ఉదయగిరి అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా రేషన్ షాపు మిషన్‌లో, అంగన్వాడీ యాప్‌లలో స్టాకు వచ్చినట్లు ఉన్నా తమకు సరుకులు రాలేదంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారన్నారు. కొన్నిచోట్ల నూనె, కందిపప్పు ఇవ్వాలంటూ డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సాధించి పరిష్కరించాలని కోరుతున్నారు.

News September 9, 2025

మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

image

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.

News September 9, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు: కలెక్టర్

image

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 నెలలు వయస్సు దాటిన పశువులకు టీకాలు వేయించాలన్నారు.

News September 9, 2025

పదవి వద్దంటూ చంద్రబాబుకి అంగర లేఖ

image

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మెహనరావును నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబుకు రామ్మెహనరావు లేఖ రాశారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎన్నో పదవులు చేసిన తాను కార్పొరేషన్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి సుముఖంగా లేనని, తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు, లోకేశ్‌ల నాయకత్వంలో పనిచేస్తానని పేర్కొన్నారు.

News September 9, 2025

మృతుడి జేబులో నాలుగు సెల్ ఫోన్లు..వీడని మిస్టరీ

image

ఇరగవరం మండలం అయినపర్రు గ్రామ శివారులో పంటచేలలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడలేదు. సోమవారం సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు జేబులో నాలుగు సెల్ ఫోన్లు ఉండడం, మృతదేహం కుళ్లిన దశలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరగవరం ఎస్ఐ జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.