Andhra Pradesh

News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో జట్లు ఎంపిక పోటీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2024-25 సంవత్సరానికి అండర్-14, 17 బాల బాలికలకు జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 25న గొరగనమూడి హైస్కూల్లో నెట్ బాల్, పెదవేగి గురుకుల పాఠశాలలో సాఫ్ట్ బాల్, బేస్ బాల్, 26న భీమవరం SCHBRMHSలో రైఫిల్ షూటింగ్, అక్టోబర్ 1న పెనుమంట్రలో బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు.

News September 23, 2024

దర్శి పట్టణంలో బాలినేని ఫ్లెక్సీలు

image

‘జై జనసేన, వెల్కమ్ బాస్’ అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈనెల 26న జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శిలో ఉన్న బాలినేని అభిమానులు దర్శిలో జనసేన ఫ్లెక్సీలు కట్టారు.

News September 23, 2024

GNT: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

News September 23, 2024

చిత్తూరు: ‘PMEGPను సద్వినియోగం చేసుకోండి’

image

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం, సబ్సిడీ, అర్హత గల యూనిట్ల వివరాలు తెలుస్తాయని చెప్పారు.

News September 23, 2024

మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శోభారాణి

image

మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.

News September 23, 2024

జిల్లా అభివృద్ధే లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్‌లో జిల్లా స్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ వికసిత భారత్‌లో భాగంగా అక్టోబరు 5 వరకు నిర్వర్తించవలసిన కార్యాచరణను వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News September 23, 2024

తూ.గో.: జలతరంగిణి జలపాతం వద్ద గల్లంతయ్యింది వీరే

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో గల్లంతైన వారు ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులుగా గుర్తించిన విషయం తెలిసిందే. వాగులో గల్లంతైన వారిని హారదీప్, సౌమ్య, అమృతగా అధికారులు గుర్తించారు. కాగా వీరి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

News September 22, 2024

వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లిన సూర్య కుమార్

image

అనంతపురం జిల్లా కేంద్రంలో ఇండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆదివారం సందడి చేశారు. దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ట్రోపీ మ్యాచ్ అనంతరం నగరంలోని వైసీపీ రాష్ట్ర నాయకుడు హరీష్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ హరీష్ కుమార్ యాదవ్ ఇంటిలో అందరితో మమేకమై సందడిగా గడిపారు. అభిమానులకు సైతం సెల్ఫీలు, ఆటో గ్రాఫ్‌లు ఇచ్చారు.

News September 22, 2024

చిరంజీవికి ఎంపీ సీఎం రమేశ్ అభినందనలు

image

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అభినందనలు తెలిపారు. చిరంజీవికి దక్కిన విశిష్ట గౌరవం మన తెలుగువారి గుర్తింపు పెంచిందన్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు చిరంజీవికి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కిందన్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణం అన్నారు.

News September 22, 2024

తూ.గో.: జలతరంగిణి ఘటనపై మంత్రి దుర్గేశ్ విచారం

image

మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద వాగులో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చాలా విచారకరమని అన్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.