India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజధానిలో తొలి శాశ్వత భవనంగా CRDA ప్రధాన కార్యాలయం రికార్డు నెలకొల్పనుంది. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా అత్యాధునిక డిజైన్, ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ జీ+7 భవనం విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. రూ.240కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం, రాయపూడి సమీపాన ఉంది. టెర్రస్‌పై ఫుడ్ కోర్ట్, జిమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలువనుంది.
విశాఖ ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో పశ్చిమబెంగాల్‌కు చెందిన రీతూ సాహు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సీబీఐకి అప్పగించారు. ఈక్రమంలో సీబీఐ అధికారులు గురువారం KGHకు వచ్చారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. కాలేజీ నుంచి ఏ సమయానికి KGHకు తీసుకొచ్చారు? పోస్టుమార్టం రిపోర్ట్, తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.
మొగల్తూరు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో నిన్న ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో బాలికను నిందితుడు కోనాల జాన్ బాబు(55) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
విశాఖను ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ తాత్కాలిక ఆఫీస్ ప్రారంభించి శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. కాగ్నిజెంట్, ANSR, సత్వ, యాక్సెంచర్ కూడా పెద్ద క్యాంపస్‌లను ప్రకటించాయి. రాబోయే 5, 10 ఏళ్లలో లక్షలాది ఐటీ ఉద్యోగాలు సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా విశాఖ మారనుంది. దీంతో రియల్ ఎస్టేట్ సైతం పుంజుకునే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
నెల్లూరు జిల్లాలో PDS రైస్ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఒక చెకోపోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మంత్రి మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.234 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వరుసగా పీడీఎస్ రైస్ బయట ప్రాంతాలకు తరలి వెళ్తుండగా అధికారులు సీజ్ చేస్తున్నారు.
కర్నూలులో గురువారం నిర్వహించిన ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. తుంగభద్ర నది సమీపంలోని సంకల్ భాగ్ వద్ద చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.
గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ అప్రమత్తమయ్యారు. కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై జాగ్రత్తలు సూచించారు. వ్యాధి మరింత ప్రబలకుండా తక్షణ చర్యగా నగరంలో పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
విశాఖ కలెక్టరేట్‌లో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ హాజరయ్యారు. శ్రమదానంతో కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. పరిసరాలను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లాలోని యువతకు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ శుభవార్త అందించింది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరగనున్న జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ పోటీలు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సేవల సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. అక్టోబరు 15లోపు mybharat.gov.in/quizలో నమోదు చేసుకోవాలి. విజేతలకు ప్రధానితో ఆలోచనలు పంచుకునే అవకాశం లభిస్తుంది.
తన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ట్వీట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. <<17822177>>ఫేక్<<>> అకౌంట్‌ను కూటమి నాయకులు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.