Andhra Pradesh

News September 9, 2025

అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

News September 9, 2025

ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

image

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News September 9, 2025

స్కూల్ గేమ్స్ అండర్ 19 షెడ్యూల్ విడుదల

image

కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల బాలికల ఎంపిక పోటీల షెడ్యూల్‌ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాఘవేంద్ర సోమవారం విడుదల చేశారు. DSA అవుట్ డోర్ స్టేడియంలో 10వ తేదీ ఆర్చరీ, ఘాట్కా, సెపక్ తక్ర 11న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుట్ బాల్, DSAలో 12న ఫెన్సింగ్, కురాశ్ , ఉషూ 13న సైక్లింగ్, కరాటే, మాల్కంబ్‌తోపాటు మరికొన్ని అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News September 9, 2025

VZM: మరో ఇద్దరు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు

image

కూటమి ప్రభుత్వం నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి 51 మంది డైరెక్టర్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. విజయనగరం నియోజకవర్గం నుంచి కెల్ల అప్పలనాయుడు(టీడీపీ), గజపతినగరం నుంచి బండారు సాయి లక్ష్మి (టీడీపీ)కి అవకాశం ఇచ్చింది.

News September 9, 2025

కర్నూలులో హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

కర్నూలులో జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్‌ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు DSP బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి 3 కత్తులు, స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత గొడవల కారణంగా ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, షేక్‌ జాహీన్‌ అహ్మద్‌, ఎస్‌ఎండీ ఇర్ఫాజ్‌, యూసుఫ్‌ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, షేక్‌ జాహీన్‌ అహ్మద్‌ను అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.

News September 9, 2025

నేడు ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరు.!

image

ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరును నేడు నిర్వహిస్తున్నట్లు YCP ప్రకటించింది. యూరియా కొరత ఉందంటూ వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఇటీవల ఎరువుల షాపులపై విస్తృత తనిఖీలు సాగాయి. కాగా YCP నిరసనకు పిలుపునివ్వగా, 30 యాక్ట్ అమలులో ఉందని పలుచోట్ల పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

News September 9, 2025

ఒంగోలులో పోలీసులపై దాడి.. ఆ తర్వాత?

image

ఒంగోలులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ పోలీసులపై పలువురు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిని పోలీస్ అధికారుల సంఘం కూడా తప్పుపట్టింది. కాగా ఈ ఘటనపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డ ఆరుగురిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఈ ఘటన వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

11న బాపట్లకు పవన్ కళ్యాణ్.!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 11న బాపట్లకు రానున్నారు. పొరుగు జిల్లాకు పవన్ వస్తున్న నేపథ్యంలో ప్రకాశం జనసేన నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఒంగోలుకు వచ్చారు. ఆయన పవన్ మంజూరు చేసిన పలు చెక్కులను నేడు పంపిణీ చేయనున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా జనసేనలో కాస్త వివాదం తెరపైకి రాగా, పవన్ ఎలా స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

News September 9, 2025

విశాఖ జూపార్క్‌లో తెల్ల గడ్డం కోతులు

image

విశాఖ జూ పార్కులో తెల్ల గెడ్డం కోతులు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీటిని పర్వత కోతులు అని పిలుస్తారు. నల్లటి కోటు ధరించినట్టు కనిపిస్తూ, గెడ్డం చుట్టూ తెల్ల బొచ్చుతో వింత హావభావాలతో ఈ కోతులు జూ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి పళ్ళు, విత్తనాలు, లేత ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. కనువిందు చేసే ఈ కోతులను చూడాలంటే మరి మీరు కూడా విశాఖ జూ పార్కును సందర్శించాల్సిందే.

News September 9, 2025

ప్రకాశం జిల్లా మాజీ MLA ఇంట్లో చోరీ.!

image

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో మాజీ MLA సుధాకర్ బాబు ఇంట్లో దుండగులు శనివారం రాత్రి చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. మద్దిపాడు SI వెంకట్ చోరీ జరిగిన తీరును సోమవారం పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో వేలిముద్రల సేకరణకు తనిఖీలు నిర్వహించారు. దుండగులు మాజీ MLA ఇంటి డోర్ లాక్‌ను మాత్రమే పెకిలించారని, అన్నీ వస్తువులు భద్రంగా ఉన్నాయని SI తెలిపారు.