Andhra Pradesh

News September 22, 2024

టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం: మంత్రి ఫరూక్

image

నంద్యాల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మైనారిటీ, న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

News September 22, 2024

జిల్లాలో ప్రతి ప్రోజెక్టుకు నీటిని అందిస్తాం: మంత్రి

image

బెలుగుప్ప మండలం జీడిపల్లి వద్ద ఉన్న హంద్రీనీవా పంప్ హౌస్‌ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలేనేని సురేంద్ర బాబు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రోజెక్టుకు నీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీడిపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

News September 22, 2024

VZM: నలుగురు ఎంపీడీవోలకు బదిలీ

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నలుగురు ఎంపీడీవోలకు బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం ఎంపీడీవో షేక్ మహమ్మద్ అఖీబ్ జావేద్‌కు ప్రకాశం జిల్లాకు, పాచిపెంట ఎంపీడీఓ పీ.లక్ష్మీకాంత్ చిత్తూరు జిల్లా, పీ.శ్రీనివాసరావుకు శ్రీకాకుళంజిల్లా, వీవీఎన్ ఆంజనేయులకు విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్తగా ఎంపీడీవోలను నియమించాల్సి ఉంది.

News September 22, 2024

తిరుపతి : విదేశాల్లో ఉద్యోగావకాశం

image

APSSDC ఆధ్వర్యంలో నర్సింగ్ అభ్యర్థులకు జపనీస్ భాష నేర్పించి అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖాధికారి లోకనాధం ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్, ANM, GNM పూర్తిచేసి 18-32 సంవత్సరాల్లోపు మహిళలు అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://shorturl.at/FB7ok వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News September 22, 2024

దసరా సెలవుల్లో అరకు వెళ్లేవారికి GOOD NEWS

image

దసరా సెలవులలో పర్యాటకుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 5 నుంచి 15 వరకు విశాఖ-అరకు మధ్య ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-అరకు(08525) రైలు విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అరకు-విశాఖ(08526) రైలు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది. సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగనుంది.

News September 22, 2024

కడప: అతివేగానికి నిండు ప్రాణం బలి

image

కడప జిల్లా మాధవరం -1 పార్వతిపురం గంగమ్మ గుడి దగ్గర రోడ్డు దాటుతున్న నారాయణ సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే యువకుడు శనివారం రాత్రి బైక్‌పై వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను కడప రిమ్స్‌కు తరలించగా చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 22, 2024

లడ్డూ వివాదంపై స్పందించిన MLA తాటిపర్తి

image

లడ్డు వివాదాన్ని కావాలనే సృష్టించి రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? అని X వేదికగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ స్పందించారు. రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టించడానికి CBN యత్నిస్తున్నారన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఆజ్యం పోస్తున్నారా.. అని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా అని Xలో పోస్ట్ చేశారు. బీజేపీ పేరుతో YCP పార్టీ కార్యాలయంపై దాడి హేయమన్నారు.

News September 22, 2024

విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులు(2024-25విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News September 22, 2024

కేసీ కెనాల్ అధికారులపై మంత్రి ఆగ్రహం

image

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని కేసీ కెనాల్ లాకుల వద్ద జలవనరుల శాఖ అధికారులు ఆదివారం గుర్రపు డెక్క, వినాయక నిమజ్జనం వ్యర్థాలు తొలగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న నేపథ్యంలోనే పనులు చేసినట్లు సమాచారం. కేసీ కెనాల్‌పై వెళ్తున్న మంత్రి తన కారు ఆపి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని ప్రశ్నించారు.

News September 22, 2024

కోటబొమ్మాళి: రైతులను అన్ని విధాల ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

image

రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ధాన్యానికి 48గంటల్లో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.