Andhra Pradesh

News September 9, 2025

శ్రీకాకుళం: టీనా మృతిపై ఎస్పీ దిగ్భ్రాంతి

image

పోలీసు శాఖలో 7 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘టీనా’ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. టీనా మృతి పట్ల ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణంలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ తదితరులు నివాళులు అర్పించారు.

News September 9, 2025

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు I.F.Cతో ఒప్పందం

image

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు జీవీఎంసీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (I.F.C.) మధ్య ఒప్పందం కుదిరింది. రూ.553 కోట్లు చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐ.ఎఫ్.సి.తో దేశంలో తొలిసారి జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్లాంట్ 225 ఎం.ఎల్.డి వ్యర్థచరాలను శుద్ధి చేస్తుందని చెప్పారు

News September 9, 2025

అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

News September 9, 2025

అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News September 9, 2025

ప్రకాశం SP మీకోసం కార్యక్రమానికి 49 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ-కోసం కార్యక్రమానికి పోలీస్ అధికారులు హాజరై ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదుల తీవ్రతను వివరించారు.

News September 9, 2025

కర్నూలు: లైంగిక వేధింపుల చట్టంపై పోస్టర్ ఆవిష్కరణ

image

కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య సోమవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. లైంగిక వేధింపులు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని వివరించారు.

News September 9, 2025

VZM: జిల్లాలో 5వేల ఎకరాల్లో IT పార్కుల ఏర్పాటు

image

IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.

News September 9, 2025

యూరియా వాడకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

యూరియా అతి వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్త యాప్‌ను రైతులందరూ ఉపయోగించుకునేలా చూడాలని, వాట్సాప్ సేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ సేవలపై రైతుల సంతృప్తి స్థాయి 30% మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు.

News September 9, 2025

GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

image

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

News September 9, 2025

ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు: కలెక్టర్

image

ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. జిల్లాలో ఎరువులు కొరత లేదని, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.