India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపట్ల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌లో గతవారం ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ, పోలీసు శాఖ ఫిర్యాదుల్లో నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై తరచూ ఫిర్యాదులు రావడంపై మండిపడ్డారు. ఇలాంటి తీరు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
చంద్రబాబు పాల్గొనే సూపర్-6 సూపర్ హిట్ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో కలిసి ముందస్తు ఏర్పాట్ల, సెక్యూరిటీ పరిశీలన చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, ప్రధాన వేదిక, ముఖ్యమంత్రి వెళ్లే రూట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతులందరకీ ఎరువులు సరఫరా చేస్తామని, ఎటువంటి అపోహలు వద్దని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎరువుల పంపిణీ చేశారు. ఇప్పటికే సచివాలయాలకు ఎరువులు చేరాయని, మరో 3 వేల మెట్రిక్ టన్నులు యూరియా వారం రోజుల్లో రానుందని తెలియజేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 600 నుంచి 800 మధ్య జ్వర పీడితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం GGHలో 1,267 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా బెడ్స్ కేటాయిస్తున్నామని అన్నారు. నార్పల, పెద్దవడుగూరు, యాడికి, బెలుగుప్ప, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి జ్వర కేసులు వస్తున్నాయని తెలిపారు.
బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని జిల్లా వ్యాప్తంగా వచ్చిన 98 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు హామీ ఇచ్చారు.
కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828 ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.
జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మించి భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ చివరి గడువని జిల్లా సైన్స్ అధికారి N. శివారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల తరుఫున వారి వినూత్న ఆలోచనలను ప్రాజెక్ట్ రూపంలో ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు.
విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన PGRSకు 167 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 58 వినతులు అందాయన్నారు. పంచాయతీ శాఖకు 12, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 42 వినతులు అందాయన్నారు. వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.