India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.
కాణిపాకం అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ప్రతిపాదనలు అందజేశారు. కాణిపాకంలో కళ్యాణ మండపం, విశ్రాంతిభవన నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు అందజేసినట్టు ఎమ్మెల్యే, ఈవో పెంచల కిశోర్ తెలిపారు. అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
YVU లలితకళా విభాగం స్కాలర్ సుజాతకు 2026 మేలో స్పెయిన్లో జరుగనున్న అంతర్జాతీయ సెమినార్‌కు నిర్వాహకులు ఫెర్నాండెజ్ ఈమెయిల్ ద్వారా ఆహ్వానించారు. ఈ పర్యటనకు వీసా ఇతరా ఖర్చులు భరిస్తామని వారు తెలిపారు. సుజాత ఫైన్ ఆర్ట్స్ హెడ్ డా.కోట మృత్యుంజయ రావు మార్గదర్శకత్వంలో ‘విజయనగర పెయింటింగ్స్’ మీద పరిశోధన చేస్తున్నారు. VC శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.పద్మ ఆమెను అభినందించారు.
భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
విశాఖలోని సీతమ్మధార వద్ద మూగ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ద్వారకా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్‌లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న బాలికపై ఆదివారం సాయంత్రం ఇద్దరు మైనర్లు అత్యాచారం చేశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ద్వారకా పోలీసులు స్పందించి అత్యాచారం చేసిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కె. రజిని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రుసుము చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. 20న సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలియజేశారు.
గతం కంటే ఘనంగా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలు నిర్వహించేందుకు సమాయత్తం కావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నెల23 నుంచి 25వరకు రాష్ట్ర పండుగగా జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించాలని, గ్రామీణ క్రీడలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, SP మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఒంటరి ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. పొలాల ధ్వంసం, మనుషులను సైతం చంపుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంటరి ఏనుగు నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రజలు నేరుగా కాకుండా ఎస్ ఆకారంలో పరుగెత్తాలని DFO భరణి పేర్కొన్నారు. పరిగెట్టేటప్పుడు ఒంటిపై ఉన్న బట్టలను ఏనుగు ముందు వేస్తే అది వాసన చూసి నెమ్మదించే అవకాశం ఉందని ఆమె వివరించారు.
Sorry, no posts matched your criteria.