Andhra Pradesh

News September 22, 2024

ఆ వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తి చేయండి: సీఎం

image

విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్‌మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.

News September 22, 2024

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు: గుంటూరు ఎస్పీ

image

నగరంలోని పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలతో శనివారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య, మైనర్లు డ్రైవింగ్ నడపడం తదితర అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ మైనర్లు వాహనాలు నడిపితే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల వద్ద పోలీసు భద్రత పెంచుతామని సూచించారు.

News September 22, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కాపుశంభం విద్యార్థినిలు

image

సెప్టెంబర్ చివరి వారంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జెడ్పీ హెచ్ స్కూల్ కాపుశంభం విద్యార్థినిలు ఆర్.అనూష, ఈ.జెనీలియా, పి భవాని ఎంపికైనట్లు స్కూల్ హెచ్.ఎం రాము శనివారం తెలియజేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొండవెలగాడలో జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో ప్రతిభను చూపి విజయం సాధించారన్నారు. పోటీలకు ఎంపికైన వారిని అభినందించారు.

News September 22, 2024

కడప: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి

image

అందరికి న్యాయం అందాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హై కోర్ట్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కడప పోలీస్ పెరేడ్‌లోని మీటింగ్ సమావేశంలో జిల్లా స్థాయి జుడీషియల్ అధికారుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అమలవుతున్న యాక్ట్స్‌పై న్యాయవాదులు నిబద్ధతతో చట్టాలను అమలు చేయాలని సూచించారు.

News September 22, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

కొవ్వూరు- కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌‌లు నం.22701 విశాఖపట్నం- గుంటూరు, నం.22702 గుంటూరు- విశాఖపట్నం రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 21, 2024

కాకినాడ: తుని మండలంలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ద్విచక్ర వాహనంపై ఓ పరీక్ష నిమిత్తం ఇద్దరు వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టిందని తుని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

తూ.గో.: మృత్యువులోనూ ఒక్కటై

image

మృత్యువులోనూ ఆ దంపతులు బంధం వీడలేదు. ఇద్దరు ఒకేసారి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలో శనివారం జరిగింది. భార్య, భర్త ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలిశెట్టి అధిచంద్రరావు (68) అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలిసిన ఆయన భార్య పోలిశెట్టి నాగవేణి(58) తీవ్ర మనస్తాపానికి గురై గంటల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

News September 21, 2024

సంక్షోభంలో గుంటూరు వైసీపీ

image

గుంటూరు అర్బన్‌లో వైసీపీ సంక్షోభంలో పడింది. ఎన్నికల సమయంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా తాజాగా పార్టీకి మరో నలుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్ ధనలక్ష్మి, 13వ డివిజన్ కార్పొరేటర్ సంకురి శ్రీను, 18వ డివిజన్ కార్పొరేటర్ వెంకట రమణ, 56వ డివిజన్ కార్పొరేటర్ కనకదుర్గ తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కు పంపారు.

News September 21, 2024

వెంకటగిరి జనసేన ఇన్‌ఛార్జ్‌పై వేటు

image

వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆయనపై ఉన్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

News September 21, 2024

తిరుపతిలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

image

తిరుపతి పట్టణం కటిక రంగడు వీధిలోని చిల్లర దుకాణంలో గంజాయి చాక్లెట్లను వెస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3,200 గ్రాముల గంజాయి మిశ్రమం కలిగిన రూ.86 వేలు విలువచేసే చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు బవర్ లాల్ తులసీరామ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.