Andhra Pradesh

News September 21, 2024

నందికొట్కూరు మండలానికి రానున్న మంత్రి నిమ్మల

image

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి ఈ నెల 22న (రేపు) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణ, పనితీరుపై సమీక్షించనున్నారు. రైలుమార్గంలో ఉదయం డోన్ చేరుకుంటారు. అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.

News September 21, 2024

ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది: ఉషశ్రీ చరణ్

image

100 రోజుల పాలన విఫలం కావడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూల‌ విషయం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. కూటమి మంచి ప్రభుత్వమా? కాదా అన్నది? ప్రజలు చెప్పాలన్నారు. కానీ కూటమి నేతలే తమది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

News September 21, 2024

వైద్య సేవలో కడప జిల్లాకు ఏ గ్రేడ్

image

ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించుటలో కడప జిల్లా ఏ గ్రేడ్ సాధించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య సేవలు తీసుకున్న వారు, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వారు, సాధారణ ప్రసవాలు, రక్తపరీక్ష తదితర విభాగాలలో ఆరోగ్య సేవలు అందించే విధానంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినట్లు వెల్లడించారు.

News September 21, 2024

హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ, కలెక్టర్

image

ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్ వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జిల్లా జడ్జీ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

News September 21, 2024

భీమిలిలో కట్టడాల కూల్చివేతపై విజయసాయిరెడ్డి స్పందన

image

భీమిలి బీచ్‌లో నిర్మించిన ప్రహరీ రెండో సారి కూలగొట్టడంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘మంత్రి నారా లోకేశ్, ఎంపీ శ్రీ భరత్ కుమ్మక్కై రాజకీయ కక్షతో మా ప్రైవేట్ స్థలంలో ప్రహరీ పగలగొట్టారు’అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇది పిల్ల చేష్టల పనిగా భావిస్తున్నానని అన్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అక్రమ కొంపను ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.

News September 21, 2024

విద్యుత్ షాక్ తగిలి రైల్వే ఉద్యోగి మృతి

image

రైల్వే స్టేషన్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భరత్ అనే ఉద్యోగి విద్యుత్ తీగల మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హై టెన్షన్ తీగలు తగిలి కుప్పకూలాడు. దీంతో తోటి సిబ్బంది హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News September 21, 2024

ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

News September 21, 2024

సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 21, 2024

తిరుమల బాలాజీ నగర్ లో కార్డన్ సర్చ్

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న క్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్థానికులు నివసించే తిరుమల బాలాజీ నాగర్ లో భద్రతా బలగాలతో కార్డన్ సర్చ్ నిర్వహించారు. స్థానికుల వివరాలతో పాటు ఆధారాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.

News September 21, 2024

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు శనివారం రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ వినతి పత్రాలను అందించే వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అవకాశం ఉంది.