India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేషనల్ వాటర్ స్పోర్ట్స్‌కు మసులా బీచ్ వేదిక కాబోతుంది. మే 15 నుంచి నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌లో ఈ పోటీలు మిలితం కానున్నాయి. బీచ్ కబడ్డీతో పాటు SEA KAYA KING పోటీలను మసులా బీచ్ (మంగినపూడి బీచ్) లో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలకు సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలి రానున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు మచిలీపట్నం సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు సముద్ర జలాలో చేపల వేట నిషేధమని విశాఖ మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. సముద్ర జలాలలో చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కోసం వేట నిషేధం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే బోట్లను, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రాయితీలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఇంద్రనాయక్ నగర్‌లో గురువారం సాయంత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్, సింగ్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన ఇంజిన్లను తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో విక్రయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే అరెస్టైన వారిని త్వరలో కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.
విశాఖలో ఈ నెల 19న నిర్వహించనున్న దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ప్రోగ్రాంకు పోలీసులు గతంలో పర్మిషన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మ్యూజికల్ ఈవెంట్స్ ప్రతినిధులు మరొకసారి పోలీసులకు అభ్యర్థన చేసుకున్నారు. వారి అభ్యర్థన మేరకు పోలీసులు పూర్తిగా సెక్యూరిటీని పరిశీలించి, భద్రతా చర్యలన్నీ ఏర్పాటు చేసినట్లు గుర్తించి మ్యూజికల్ ప్రోగ్రాంకు అనుమతులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు.
విశాఖ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఇద్దరు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, నిషేధిత ఈ- సిగరెట్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66,90,609 ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఫోన్లు, ఈ- సిగరెట్లను నగరానికి అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. సంబంధిత మెరిట్ సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 20వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు తన కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. సెలవు దినాల్లోనూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం అధ్యాపకురాలు పూజిత అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. సంగీత వాయిద్య ప్రదర్శనలో ఆమె ఆ ఘనత సాధించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబరిచిన పూజితకు హైదరాబాదులో ఈ అవార్డు అందచేశారు.
తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. RWS అధికారులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, సిబ్బందిని ఆమె ఆదేశించారు. అవసరమైన ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.