India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విశాఖపట్నం కలెక్టరేట్‌లో 8వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.in వెబ్‌సైట్లో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.
రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
కడియం, రాజమండ్రి రూరల్ మండలంలో తూ.గో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోని మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని వారికి చెప్పారు. అమోనియా, నానో యూరియాలను రైతులు తమ పొలంలో వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవాలన్నారు.
భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరు ఆందోళన చెంద వద్దని జిల్లా(ట్రైని) అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జహీద్ తెలిపారు. మోపిదేవి మండలం పెదప్రోలు, కొక్కిలిగడ్డ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతుల నుంచి యూరియా పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హరనాథ్, సొసైటీ ఛైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, రైతులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.