Andhra Pradesh

News September 21, 2024

ఇన్‌స్టాలో ప్రేమ.. సోమందేపల్లిలో పెళ్లి

image

సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువుకు చెందిన గంగాధర్‌కు మూడు నెలల క్రితం ఇన్‌స్టాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన అనూష పరిచయమైంది. తరచూ ఇన్‌స్టాలో మాట్లాడుకునే వారి మధ్య ప్రేమ చిగురించింది. శుక్రవారం ఆమె సోమందేపల్లికి చేరుకుని తాను ఇష్టపడిన గంగాధర్‌ను పెళ్లి చేసుకుంది. తొలుత వీరి పెళ్లికి ఇద్దరి తరఫున పెద్దలు అంగీకరించలేదు. గ్రామస్థులు అండగా ఉంటామని భరోసానివ్వడంతో వివాదం సద్దుమణిగింది.

News September 21, 2024

తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతి(TPTY)-విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ నం.22708 TPTY-VSKP రైలును ఈ నెల 29న, నం.22707 VSKP-TPTY రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 21, 2024

పత్తికొండలో క్వింటా టమాటా రూ.3,200

image

రాష్ట్రంలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమాటా మార్కెట్ అతిపెద్దది. జిల్లాలోని తుగ్గలి, మద్దికేర, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల నుంచి పత్తికొండ మార్కెట్‌కు రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకొస్తారు. వారం రోజులుగా ఈ మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో గరిష్ఠంగా రూ.30పైనే పలుకుతున్నాయి. నిన్న క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.3,200 పలికింది.

News September 21, 2024

కడప: తిరుపతి సోలాపూర్ రైలు గడుపు పెంపు

image

కడప రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే సోలాపూర్-తిరుపతి- సోలాపూర్ (01437/01438) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గడువును, డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించారన్నారు. కడప ఎర్రగుంట్ల స్టాపింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

News September 21, 2024

విశాఖ: 51 మంది వీఆర్వోలకు బదిలీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.

News September 21, 2024

రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

image

గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జిఓ క్లబ్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన జట్లను విశాఖపట్నం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు.

News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

News September 21, 2024

ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

image

రైల్వే లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగా ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న తిరుపతి- విశాఖపట్నం, 30న విశాఖపట్నం- తిరుపతి, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, రాజమహేంద్రవరం – విశాఖపట్నం, అలాగే అక్టోబర్ 1న విశాఖపట్నం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News September 21, 2024

తూ.గో: హత్యాయత్నం కేసు.. భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

image

అదనపు కట్నం కోసం భార్యని వేధించడంతో పాటు ఆమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఏలూరుకు చెందిన సంస్కృతం లెక్చరర్ రాజేశ్వరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బాబు శుక్రవారం తీర్పు చెప్పారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన జువాలజీ లెక్చరర్ మధురాక్షిపై ఆమె భర్త 2020 సెప్టెంబర్ 10న తునిలో కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడు.

News September 21, 2024

మహాకవి గురజాడ జయంతి నేడు

image

నవయుగ వైతాళికుడు, మహాకవిగా పేరు గాంచిన గురజాడ వెంకట అప్పారావు జయంతి విజయనగరంలో శనివారం జరగనుంది. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా సర్వసిద్ధి రాయవరంలో ఆయన జన్మించారు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా పనిచేసే సమయంలో అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత విజయనగరం వచ్చి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 20వ శతాబ్దంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆయన పోరాడారు. SHARE IT..