India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని SP వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి, ఇందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతున్నారు. ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌పై కూడా ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అర్జీలను Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు.
ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
రైతులకు యూరియా కొరత లేకుండా అందిస్తున్నామని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కోపల్లె సొసైటీలో యూరియా వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సొసైటీ గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ పాల్గొన్నారు.
ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి రైతులకు రూ.1200 ప్రకారం మద్దతు ధర లభిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉల్లి రైతుల నుంచి 11, 174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని, అలాగే 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.
ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ డ్రామాలు ఆడుతోందని మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. ఉల్లి ధరల విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని రూ.1,200కు కొనాలని ఇదివరకే చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలుంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరిస్తుందన్నారు. ఏమి లేకున్నా ఏదో జరిగిపోయినట్లు చెప్పడంలో వైసీపీ నేతలు ముందుంటారన్నారు.
Sorry, no posts matched your criteria.