Andhra Pradesh

News May 1, 2024

లోకేశ్ పర్యటన ఈ నెల 5కు వాయిదా

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాజంపేట పర్యటన 5కు వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన మేరకు 2న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అదే రోజు చంద్రబాబు రాయచోటి, కడపలో ప్రచారం చేయనున్నారు. దీంతో పార్టీ నేతలంతా అధినేత పర్యటనకు హాజరు కావల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పర్యటన వాయిదా పడింది.

News May 1, 2024

ప్రకాశం జిల్లాలో డీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఏఈడీ)లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు డీసెట్-24 నోటిఫికేషన్ విడుదలైనట్లు DEO సుభద్ర తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్లో మే 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే9 వరకు ఆన్‌లైన్లో సమర్పించవచ్చు. మే 24న పరీక్ష ఉండగా, మే 30న ఫలితాలు ప్రకటిస్తారు.

News May 1, 2024

తూ.గో.: లాడ్జిలో వ్యభిచారం

image

రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్ రోడ్డులోని RRగ్రాండ్ లాడ్జిలో వ్యభిచార ముఠాను రామచంద్రపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ దొరరాజు తెలిపిన వివరాలు.. లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో SI సురేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.

News May 1, 2024

ఏలూరు: యువతిపై ఇద్దరి అత్యాచారం

image

ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ఏలూరు నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి తంగెళ్లమూడికి చెందిన కాకిశ్యామ్, నక్కా ఏసురత్నం మాయమాటలు చెప్పి నగరశివారులో అద్దెకు తీసుకున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దిశ CI విశ్వం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులతో పాటు వారికి సహకరించిన షేక్ అఖిల్ బాషాను అరెస్ట్ చేశారు.

News May 1, 2024

రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం కేసు

image

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు 13 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. అలాగే గ్రామంలోకి అనుమతి లేకుండా వెళ్ల వద్దని పోలీసులు సూచించినా.. లెక్కచేయకుండా వెళ్లడంతో రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురిపై మరో కేసు నమోదు చేశారు.

News May 1, 2024

సంబల్ పూర్-బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

image

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. సంబల్ పూర్- ఎస్ఎంవీ బెంగళూరు (08321) ప్రత్యేక రైలు మే 9, 16 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి మర్నాడు తెల్లవా రుజామున 4.55 గంటలకు దువ్వాడ వచ్చి.. అక్కడి నుండి 5 గంటలకు బెంగళూరుకు వెళుతుందన్నారు.

News May 1, 2024

రాజుపాలెం: బావిలో పడి వివాహిత మృతి

image

బావిలో పడి వివాహిత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజుపాలెం మండలం ఇనిమెట్లకు చెందిన అన్నపూర్ణ పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లింది. తాగునీటి కోసం సమీపంలోని నేలబావి వద్దకు వెళ్లగా.. కాలుజారి బావిలో పడి మృతి చెందింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. చివరికి బావిలో శవమై కనిపించింది. మృతురాలి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 1, 2024

బొబ్బిలిలో సీఎం సభ.. రక్షణ కల్పించాలని ఫిర్యాదు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ బొబ్బిలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట బొబ్బిలి మొయిన్ రోడ్డులో సభ పెట్టేందుకు సన్నాహాలు చేయగా.. బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా సభ పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి సమీపంలో సభ నిర్వహించడంపట్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

News May 1, 2024

అనంత: రానున్న మూడు రోజుల్లో తీవ్ర వడగాలులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకలకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. మే 1, 2, 3వ తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు ఉదయం 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎండలో పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

News May 1, 2024

తూ.గో.: 3 ఎంపీ స్థానాలకు 42 మంది

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 3 పార్లమెంట్ స్థానాలకు 42 మంది పోటీలో ఉన్నారు. కాకినాడ పార్లమెంట్‌ బరిలో 15 మంది, అమలాపురం పార్లమెంట్‌ నుంచి 15 మంది, రాజమండ్రి MP స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీలకు 108 మంది, కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీలకు 91 మంది, తూ.గో జిల్లాలో 7 అసెంబ్లీలకు 71 మంది పోటీ చేస్తున్నారు.